ఎన్టీఆర్ ఫ్యాన్స్ రణరంగం..! హాస్పిటల్ ధ్వంసం, లాఠీఛార్జ్..!
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా ఆయన చుట్టూ ఫ్యాన్స్ గుమ్మికూడుతారు. ఆయన సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్స్ లో మనం చూస్తూనే ఉంటాం. ఎన్టీఆర్ ఎక్కడికైనా వస్తున్నారంటే ఆయన కంటే ముందే వందల మంది ఫ్యాన్స్ అక్కడకు చేరుకుంటారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రణరంగం సృష్టించారు. రచ్చ రచ్చ చేశారు. అయితే ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరులో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. దాంతో తారక్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
తమ అభిమాన హీరో ఎన్టీఆర్ ను చూడాలన్న కోరికతో ఫ్యాన్స్ ఒక్కసారిగా హాస్పిటల్ లోకి దూసుకొచ్చారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆస్పత్రిలోని ఎస్కలేటర్ ధ్వంసం అయింది. అలాగే ఫర్నిచర్ డ్యామేజ్ అయింది. అక్కడి పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై కర్ణాటక పోలీసుల లాఠీచార్జ్ చేశారు. దాంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక గతంలో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఇలాంటి పరిస్థితి నెలకున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు పర్మిషన్లు, పాసులు లేకపోయినా ఎన్టీఆర్ అభిమానులు భారీగా వచ్చారు. దాంతో అక్కడి సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నోవాటెల్ హోటల్ అద్దాలు పగలగొట్టి, కుర్చీలు విరగ్గొట్టారు. ఈ మేరకు అక్కడ రచ్చ రచ్చ చేశారు. దాంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కాన్సిల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తారక్ ఫ్యాన్స్ ఇలా రెచ్చిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రస్తుతం డ్రాగన్ మూవీ రెడీ అవుతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. డ్రాగన్ మూవీకోసం ఎన్టీఆర్ పూర్తిగా మారిపోయారు. ఆయన లుక్ అద్దిరిపోయింది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మూవీపై మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.












Click it and Unblock the Notifications