నాగ చైతన్య గురించి ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్.. అలా అన్నారేంటి !
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు లాంటి వారు అనడంలో సందేహం లేదు. ఇక వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ.. అక్కినేని నాగార్జున స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. ఇక నేటి తరంలో నందమూరి ఫ్యామిలీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమదైన శైలిలో నటిస్తుండగా.. అక్కినేని ఫ్యామిలీలో నాగ చైతన్య, అఖిల్ దూసుకుపోతున్నారు.
అయితే అప్పట్లో ఎన్టీఆర్ - ఏఎన్నార్ కలిసి నటించారు. ఆ తర్వాత హరికృష్ణ - నాగార్జున కలిసి నటించారు. ఇక ఈ జనరేషన్ లో అయితే ఎన్టీఆర్ - నాగ చైతన్య ఎప్పుడెప్పుడు కలిసి నటిస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు ఆయన నటించిన 'దేవర' సినిమా జపాన్‌లో 28వ తేదీన విడుదల అయ్యింది.

ఈ క్రమంలోనే డైరెక్టర్ కొరటాల శివతో పాటు జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ వరుస ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. రీసెంట్ గానే జపాన్ ఫ్యాన్స్‌తో కలిసి ఎన్టీఆర్ స్టెప్పులు వేసిన వీడియో సోషల్‌మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ శివ కొరటాలతో పాటు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్.. నాగచైతన్య గురించి ఆయన రెస్టారెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీఆర్ మాట్లాడుతూ తాను జపాన్ ఫుడ్ ని చాలా ఇష్టంగా తింటానని తెలిపారు. హైదరాబాదులో జపాన్ ఫుడ్ తినాలని అనిపిస్తే కచ్చితంగా 'షోయు' రెస్టారెంట్ కి వెళ్ళాలి. అది నా ఫ్రెండ్, హీరో నాగచైతన్యది. ఆ రెస్టారెంట్లో మనకు చాలా రకాల జపాన్ ఫుడ్స్ లభిస్తాయి. అందులో సుషీ అనే జపనీస్ ఫుడ్ అంటే నాకు బాగా ఇష్టం. అది చాలా అమేజింగ్ గా ఉంటుంది. ఎప్పుడు నాకు జపాన్ ఫుడ్ తినాలనిపించినా సరే నేను కచ్చితంగా ఆ రెస్టారెంట్ కి వెళ్ళిపోతాను అంటూ చెప్పారు.
ఫంక్షన్స్ లో అయినా బయట అయిన ఎన్టీఆర్ - చైతన్య కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. ఇంటర్వ్యూల్లో కూడా ఎప్పుడూ ఒకరి గురించి మరొకరు చెప్పింది కూడా తక్కువే. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎన్టీఆర్ .. చైతూ గురించి పొగడ్తలు కురిపించడం పట్ల రెండు కుటుంబాల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2' మూవీలో నటిస్తున్నారు. ఇది బాలీవుడ్ డెబ్యూ కావడంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలానే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే భారీ సెట్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.












Click it and Unblock the Notifications