'హరిహర' వద్దు.. 'OG' ముద్దు.. రిలీజ్ కు ముందే పవన్ కు షాక్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే 2 నెలల వ్యవధిలోనే పవన్ కల్యాణ్ రెండు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నెల 24న పవన్ కల్యాణ్- నిధి అగర్వాల్​ జంటగా నటించిన సినిమా 'హరిహర వీరమల్లు' రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దీంతో ఫ్యాన్స్​ సినిమాపై భారీ అంచనాలను పెంచుకుంటున్నారు. మరోవైపు సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ ఓజీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో ఒకటి క్రిష్ జాగర్లముడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన హరిహర విరామల్లు. సూర్య చిత్ర బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 24న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మరో చిత్రం OG. ప్రముఖ డైరెక్టర్ డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను సుజిత్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

అయితే ఈ రెండు సినిమాలకు థియేట్రికల్ రైట్స్ విషయంలో భారీ తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. హరిహరతో పోల్చితే OG సినిమా రైట్స్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. బడ్జెట్ వ్యయం భారీగా పెరగడంతో నిర్మాత ఏఎం రత్నం కాస్త ఎక్కువగానే కోట్ చేస్తున్నాడట. కానీ ఆ రేట్ కాదని నిర్మాతతో బయ్యర్స్ బేరాలు ఆడుతున్నారని సమాచారం. ఈ క్రమంలో హరిహర వీర మల్లు అంటే అంతంత మాత్రంగానే ఆసక్తి చూపిస్తున్న బయ్యర్స్ OG కోసం మాత్రం ఎగబడుతున్నారట.

OG Movie Rights See Fierce Competition Compared to Harihara Veeramallu

ఇక ఈ మూవీని ఈ సినిమాను క్రిష్ జాగర్లముడి, ఏ ఎమ్​ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ కథను రెండు భాగాలుగా నిర్మించనున్నారు. మొదటిది జూలై 24న విడుదల చేసేందుకు మేకర్స్​ డేట్​ ఫిక్స్​ చేశారు. పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్‌తో పాటు, తారాగణం బాబీ డియోల్​, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్​, ఈ చిత్రంలో ఔరంగజేబ్‌ పాత్రలో కనిపించనున్నారు.

మరోవైపు ఓజీ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక సినిమా ఓజీ గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో పవన్‌ కల్యాణ్ 'ఓజాస్‌ గంభీర' అనే పవర్​ ఫుల్​ పాత్రలో కనిపించనున్నారు. ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్‌ నటిస్తున్నారు. యుంగ్​ బ్యూటీ ప్రియాంకా మోహన్‌ హీరోయిన్​ గా నటిస్తోంది. వింటేజ్​ నటి శ్రియా కీలక పాత్ర పోషిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+