'పుష్ప2' సెట్‌లో గొడవ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 షూటింగ్ జరుపుకుంటోంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్స్ లో చిత్రీకరణ జరుగుతోంది. వాస్తవానికి ఆగస్టు 15నే విడుదల కావాల్సివున్న ఈ సినిమా పవన్ కల్యాణ్ అభిమానులతో ఉన్న విభేదాలవల్ల, జరిగిన గొడవల్ల డిసెంబరు ఆరుకు నిర్మాతలు వాయిదా వేశారు. ఆ సమయంలో విడుదల చేసివుంటే నష్టం జరిగుండేదనే భావనలో నిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం జానీమాస్టర్ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే.
రాజీకుదర్చాలని ప్రయత్నించిన సుకుమార్?
గోవాలో ఉన్న జానీమాస్టర్ ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో రోజుకో విషయం బయటకు వస్తోంది. జానీమాస్టర్ పై ఫిర్యాదు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ కు, జానీకి సయోధ్య కుదర్చాలని ఓ స్టార్ హీరో ప్రయత్నించారు. అది కుదర్లేదు. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. దర్శకుడు సుకుమార్ కూడా జానీని, బాధితురాలిని పిలిచి మాట్లాడారాని, రాజీ కుదర్చాలని ప్రయత్నించారంటూ జానీమాస్టర్ సతీమణి సుమలత వెల్లడించారు. పుష్ప2 షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సెట్ లో జానీకి, తన అసిస్టెంట్ కు గొడవ జరిగినట్లు సమాచారం.

సెట్ కు వెళ్లి గొడవ చేసిన జానీ?
పుష్ప2 కోసం ఆమె ఓ పాటకు కొరియోగ్రఫీ కంపోజ్ చేయగా జానీ సెట్ కు వెళ్లి గొడవ చేశారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. ఈ సమయంలోనే దర్శకుడు సుకుమార్ కలగజేసుకొని సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గొడవ సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో సెట్ లో తాను కూడా ఉన్నానని, అటువంటి గొడవేదీ జరగలేదని సుమలత తెలిపారు.
బాధితురాలు తన వయసు దాస్తోందని, మైనర్ అంటూ అబద్దం ఆడుతోందని, బాధితురాలి తల్లి ఎందుకు బయటకు వచ్చి నిజం చెప్పడంలేదని ఆమె ప్రశ్నిస్తున్నారు. తాను తన భర్తకు రెండో వివాహం చేయాలని చూడటం అనే విషయం పెద్ద అబద్దమని, ఆయనపై చేస్తున్న ఆరోపణలకు ఒక్క సాక్ష్యం కూడా లేదని సుమలత స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications