కేవలం 300 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయిన ఏకైక సినిమా
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు,అదృష్టం కూడా కలిసి రావాలి. టాలెంట్ ఉండి అదృష్ట లేక చాలామంది హీరో, హీరోయిన్లు ఫెడ్ అవుట్ అయిపోయారు, అవుతున్నారు కూడా. ఫ్యామిలీ బాగ్రౌండ్ అనేది ఒకటి,రెండు సినిమాలకు మాత్రమే ఉపయోగపడుతుందని కొందర్ని చూస్తే అర్థం అవుతోంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు బోనీకపూర్ పుత్రరత్నం అర్జున్ కపూర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది. అయితే ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా సరైన విజయం సాధించలేదు.
అందులో ఓ సినిమా అయితే దేశంలో అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమానే ది లేడి కిల్లర్. అర్జున్ కపూర్ నటించిన 'ది లేడీ కిల్లర్' సినిమా బాలీవుడ్ చరిత్రలో అతి తక్కువ వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించారు.2023 నవంబర్ 3న విడుదలైంది. 'ది లేడీ కిల్లర్' సినిమా కేవలం రూ.70 వేలు మాత్రమే వసూలు చేసింది.షూటింగ్ పూర్తి కాలేదు. అసంపూర్తి షాట్‌లు, వాయిస్‌ఓవర్‌లతో సినిమాను విడుదల చేయడం కారణంగా నాణ్యత తగ్గింది.

దేశవ్యాప్తంగా కేవలం 12 షోలు మాత్రమే ఈ సినిమాను ప్రదర్శించారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు కేవలం 300 మంది టికెట్లు కొనుగొలు చేశారు.ఇప్పటి వరకు చరిత్రలో ఇంత తక్కువ మంది టికెట్ కొనుగొలు చేసిన సినిమాగా 'ది లేడీ కిల్లర్' రికార్డు సృష్టించింది.'ది లేడీ కిల్లర్' సినిమా బాలీవుడ్ చరిత్రలో ఒక విచిత్రమైన అధ్యాయంగా నిలిచిపోయింది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా అతి తక్కువ వసూళ్లు చేయడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ సినిమా విఫలం కావడానికి అనేక కారణాలున్నాయి. అయితే, అర్జున్ కపూర్ మరియు భూమి పెడ్నేకర్‌ల నటనకు మాత్రం ప్రశంసలు అందుకుంది.












Click it and Unblock the Notifications