ఫ్లాప్‌తో రూ.100 కోట్లు సాధించే ఏకైక తెలుగు హీరో అతనే..!
ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు హిట్ కావాలంటే చాలా లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.సినిమా కంటెంట్ కన్నా, సోషల్ మీడియాలో హీరోల మీద నెగిటివ్ ట్రెండ్‌ను దాటుకుని ఆ సినిమా బయటపడాల్సి ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతుంటే, మిగత హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఆ సినిమాపై నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నారు. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతుంటే మిగత హీరోల అభిమానులు ఫ్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ నెగిటివ్‌ను తట్టుకుని నిలిచిన సినిమా మాత్రమే గట్టెక్కుతున్నాయి. ఎన్టీఆర్ 'దేవర', అల్లు అర్జున్ 'పుష్ప-2' సినిమాలు నెగిటివ్ టాక్‌ను తట్టుకుని మరి విజయం సాధించాయి. అయితే ఈ సినిమాల్లో కంటెంట్ ఉండటం వల్లే ఈ సినిమాలు హిట్‌గా నిలిచాయి. అయితే ఓ హీరో సినిమా ప్లాప్ అయినప్పటికీ ఏకంగా రూ.100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి ట్రెండ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ఆ హీరో మరెవ్వరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన నటించిన 'గుంటూరు కారం' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఏకంగా రూ.100 కోట్లు సాధించింది.

మహేష్ బాబు ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో 'గుంటూరు కారం'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో గుంటూరు కారంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని నమోదు చేయలేకపోయింది.గత సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. కథలో కొత్తదనం లేదని మహేష్ అభిమానులే సినిమాపై విమర్శలు గుప్పించారు. మహేష్ అభిమానులను సైతం ఈ సినిమా అలరించలేకపోయింది.
త్రివిక్రమ్ మార్క్ లేకపోవడంతో పాటు, ఆయన గత సినిమాలను గుర్తు చేయడంతో బాక్సాఫీస్ వద్ద 'గుంటూరు కారం' ఫ్లాప్‌గా నిలిచింది. అయినప్పటికీ ఈ సినిమా రూ. 76 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్, రూ. 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే రూ.250 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి ఉండేది. మొత్తానికి ఫ్లాప్‌తో రూ.100 కోట్లు సాధించిన హీరోగా మహేష్ బాబు నిలిచారు.












Click it and Unblock the Notifications