Optical Illusion : ఈ పార్కులో న్యూస్ పేపర్ ఎక్కడుందో కనిపెట్టగలరా?
ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటే మన కళ్లను, మెదడును మోసం చేసే చిత్రాలు. వీటిని చూడటం వల్ల కేవలం వినోదమే కాకుండా, మన ఏకాగ్రత మరియు గమనించే శక్తి కూడా పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే వీటిని విజువల్ ఇల్యూషన్స్ అని కూడా పిలుస్తారు. అందుకే వీటిని మేధస్సు పరీక్షలుగా, పజిల్స్‌గా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
నిపుణుల పరిశోధనల ప్రకారం.. ఆప్టికల్ ఇల్యూషన్స్‌ను తరచూ సాధన చేయడం వల్ల ఏకాగ్రత, పరిశీలనా శక్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా పెద్దవయసులో వచ్చే cognitive decline ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ సవాల్‌లో, ఒక పార్క్ చిత్రంలో దాగి ఉన్న వార్తాపత్రికను కేవలం 9 సెకన్లలో గుర్తించాలి. చిత్రాన్ని గమనిస్తే.. ఒక అందమైన పార్కులో ఉన్న కాఫీ షాప్‌లో కొందరు కాఫీని ఆస్వాదిస్తూ కూర్చున్నారు. మరికొందరు జంటలు నడుస్తూ మాట్లాడుకుంటూ, కొందరు బెంచ్‌లపై విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తారు. ఈ సాధారణమైన దృశ్యాల మధ్యే ఆ రహస్య వార్తాపత్రికను దాచారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, చిన్నచిన్న మార్పులు, సూక్ష్మ వివరాలను వెంటనే గుర్తించే వ్యక్తులు ఈ తరహా ఇల్యూషన్లను త్వరగా పరిష్కరించగలుగుతారు. చాలా మందికి ఇది కష్టంగా అనిపించినా, ఓపికతో జాగ్రత్తగా పరిశీలిస్తే పరిష్కారం మీ కళ్ల ముందే ఉండే అవకాశం ఉంది. 9 సెకన్లు పూర్తయ్యాక, కొందరు నిశితమైన దృష్టి గల రీడర్లు ఇప్పటికే వార్తాపత్రికను గుర్తించి ఉంటారు.
అయితే చాలామంది ఎంత చూసినా అది కనిపించలేదని భావించవచ్చు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఈ సవాల్‌కు సంబంధించిన పరిష్కారం తెలుసుకుందాం. ఈ చిత్రంలో దాగి ఉన్న వార్తాపత్రిక గోధుమ రంగు దుస్తులు ధరించిన ఒక మహిళ కూర్చున్న బెంచ్‌పై ఉంది. ముఖ్యంగా, చిత్రం దిగువ కుడి వైపు భాగాన్ని గమనిస్తే అది స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎంత వేగంగా వార్తాపత్రికను గుర్తించగలిగారు? కామెంట్ చేయండి..












Click it and Unblock the Notifications