విశ్వంభరుడికి చిరు సన్మానం
Megastar Chiranjeevi: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డుల్లో ఏపీికి చోటు దక్కింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి.. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇదే జాబితాలో వైజయంతిమాల బాలి, బిందేశ్వర్ పాఠక్, పద్మా సుబ్రహ్మణ్యం ఉన్నారు.
పద్మభూషణ్ అవార్డులకు ఎంపికైన వారిలో ఎం ఫాతిమా బీవీ, మిథున్ చక్రవర్తి, హర్మస్ జీ ఎన్ కామా, సీతారాం జిందాల్, అశ్విన్ బాలచంద్ మెహతా ఉన్నారు. తైవాన్‌కు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్త యువాంగ్ లియూ పేరు సైతం పద్మభూషణ్ అవార్డుల జాబితాలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం.

పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవిని అభినందిస్తోన్నారు. ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలను తెలియజేస్తోన్నారు. సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు, పలువురు టెక్నీషియన్ల రాకపోకలతో చిరంజీవి నివాసం రద్దీగా మారింది.
చిరంజీవిని కలిసి శుభాకాంక్షలను తెలియజేసిన వారిలో విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ట, మారుతి, ఛోటా కే నాయుడు, మయూఖ్ ఆదిత్య, నిమ్మగడ్డ శ్రీకాంత్ ఉన్నారు. తాజాగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కొద్దిసేపటి కిందటే మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. శాలువా కప్పి సన్మానించారు. ఆయన వెంట స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, రాజా రవీంద్ర ఉన్నారు.
ప్రస్తుతం చిరంజీవి.. తన కొత్త సినిమా విశ్వంభర షూటింగ్‌లో ఉన్నారు. ఆయన నటిస్తోన్న ఈ సినిమా సెట్స్‌పై ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతోంది.












Click it and Unblock the Notifications