ఆ సినిమాను వదలుకొని ఇప్పటికీ బాధపడుతున్న ప్రభాస్
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రూ.1200 కోట్ల కలెక్షన్లకు చేరుకోబోతోంది. దీంతోపాటు జపాన్ లో కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. సైన్స్ ఫిక్షన్ కు పురాణాలను ముడిపెట్టి దర్శకుడు చూపించిన విధానానికి సినీ ప్రియులంతా ముగ్ధులయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర భారతదేశంలో ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. హిందీ బెల్టులో ఇప్పటికీ కలెక్షన్లు అలాగే కొనసాగుతుండటంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో కూడా రూ.100 కోట్లు సాధించిన సినిమాగా నిలవబోతోంది.
వంశీకి మరో అవకాశం ఇద్దామని
కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో పలువురు దర్శకులు కథలను పట్టుకొని హీరోల దగ్గరకు వస్తుంటారు. కొన్ని నచ్చినప్పటికీ అనివార్య కారణాలవల్ల చేయడానికి వీలుపడదు. కొంతకాలం ఆగమని చెప్పినా దర్శకులు మరో హీరోను చూసుకొని సినిమాను పూర్తిచేస్తారు. అలాగే డార్లింగ్ ప్రభాస్ దగ్గరకు దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ కథను తీసుకువెళ్లారు. అది బాగా నచ్చినప్పటికీ బిజీగా ఉండటంతో కుదర్లేదు. ప్రభాస్ మున్నా సినిమాతోనే వంశీ పైడిపల్లి దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనుకున్నంత స్థాయిలో ఆడనప్పటికీ మరో అవకాశం ఇద్దామని ప్రభాస్ భావించారు. అయితే అది కూడా కుదర్లేదు.

బిజీగా ఉండటంవల్ల చేయలేకపోయా
దీంతో వంశీ ఆ కథను జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పి ఘనవిజయాన్ని అందుకున్నాడు. క్లాస్, మాస్ కలిసిన కథాంశంతో వచ్చిన ఆ సినిమా చేయనందుకు ప్రభాస్ ఇప్పటికీ తన సన్నిహితుల దగ్గర బాధను వ్యక్తం చేస్తుంటాడు. మంచి కథ, మంచి సినిమా అని, బిజీగా ఉండటంవల్ల చేయలేకపోయానని అంటుంటారు. ప్రస్తుతం కల్కి తర్వాత రాజాసాబ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఇది విడుదల కాబోతోంది. దీనితర్వాత హను రాఘవపూడితో ఫౌజీ చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చేస్తాడు. ఈ మూడు సినిమాల తర్వాత సలార్2, కల్కి2 చేయాల్సి ఉంది. ఇలా ఐదు సినిమాలతో ప్రభాస్ మంచి జోరుమీద ఉన్నారు.












Click it and Unblock the Notifications