భర్త సూసైడ్.. ప్రియుడితో రెండో పెళ్లికి రెడీ అయిన తెలుగు హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు అనేవి చాలా కామన్. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడం ద్వారా వివాహాలు చేసుకున్న జంటలు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. అయితే ఇలా ప్రేమ వివాహాలు చేసుకున్న జంటల్లో కలిసి ఉన్నది చాలా తక్కువే అని చెప్పాలి. సెలబ్రిటీలు విడాకుల బాట పడుతున్నారు.ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.
తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. విడిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు.తాజాగా ఓ తెలుగు హీరోయిన్ రెండో పెళ్లికి రెడీ అయింది. విచిత్రం ఏమిటంటే.. ఆమె మొదటి భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి సమయంలో ఆమె తన రెండో పెళ్లిని ప్రకటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

నటి పావని రెడ్డి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచియం లేకపోవచ్చు కానీ, తమిళ ప్రేక్షకులకు మాత్రం పావని రెడ్డి సుపరిచితురాలే. పావని రెడ్డి తొలుత మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ నటించింది. బుల్లితెరపై ఫుల్ క్రేజ్ సంపాదించుకోవడంతో ఈ బ్యూటీకి సినిమాల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి.ఆమె 2001లో హిందీ చిత్రం "లాగిన్" ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అమృతం చందమామలో (2013), వజ్రం (2015), 465 (2017), మొట్ట శివ కెట్ట శివ (2017), ప్రేమకు రెయిన్‌చెక్ (2018), జూలై కాట్రిల్ (2019), సేనాపతి (2021), మళ్ళీ మొదలైంది (2022), తునివు (2023) లాంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే పావని రెడ్డి తెలుగు నటుడు అయిన ప్రదీప్ కుమార్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, ప్రదీప్‌కుమార్ 2017లో ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే పావని రెడ్డి మరొకరితో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే ప్రదీప్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ప్రచారం జరిగింది.ప్రదీప్ కుమార్ ఆత్మహత్య తర్వాత నిర్మాత ఆనంద్‌జాయ్‌ను పావని రెడ్డి రెండో వివాహం చేసుకుందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిది ఏమీ లేదని వీరిద్దరు క్లారిటీ ఇచ్చారు. పావని రెడ్డి తాజాగా తన రెండో పెళ్లిపై కీలక ప్రకటన చేశారు.
తన స్నేహితుడు, కొరియోగ్రాఫర్ అమీర్‌ను వివాహం చేసుకోవడానికి పావని రెడ్డి రెడీ అవుతున్నారు.ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ప్రదీప్ కుమార్ ఆత్మహత్య తర్వాత పావని రెడ్డి అమీర్‌తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోనున్నారు.దీనికి సంబంధించిన వీడియోను పావని రెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇది చూసిన నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పావని, అమిర్‌లకు అభినందనలు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications