16 ఏళ్ల తర్వాత బెస్ట్ ఫ్రెండుతో కలిసి పవన్ కళ్యాణ్ మూవీ..!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఏడాది వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్.. "హరిహర వీరమల్లు" చిత్రంతో నిరాశపరిస్తే.. "ఓజీ" మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఆయన సినిమాలకు హిట్, ఫ్లాప్ లతో సంబంధం ఉండదంటే అతిశయోక్తి కాదు. అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మార్చి 26న విడుదల చేయనున్నారు.

కాగా లేటెస్ట్ గానే ఈ చిత్రానికి సంబంధించి తన వంతు షూటింగ్ కూడా ఫినిష్ చేసేశారు పవర్ స్టార్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుండడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అలాగే గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనుండడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.

pawan-kalyan-best-friend-anand-sai-worked-for-usthad-bhagath-singh-movie-under-harish-shankar-direct

ఈ క్రమంలోనే ఇటీవలే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దాదాపు 16 సంవత్సరాల తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్.. ఆయన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి పనిచేశారని చెప్పుకొచ్చారు. చివరగా 2010లో వచ్చిన కొమురం పులి సినిమాలో వర్క్ చేశారని.. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ మూవీతో కలిసి పనిచేస్తుండడం మరో మెమరబుల్ థింగ్ అంటూ ఓపెన్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే..?

పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్.. ఎవరో కాదు పాపులర్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. ఇప్పటివరకు ఆయన తెలుగులో ఎన్నో చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. అలాగే ఆలయ నిర్మాణాల్లోనూ భాగం అయ్యారు. యాదాద్రి టెంపుల్ కూడా ఆయనే చీఫ్ ఆర్కిటెక్ట్. దగ్గరుండి ఆలయ నిర్మాణ పనులు చూసుకున్నారు. 2013లో నాయక్ సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కేవలం ఆలయాల నిర్మాణంలోనే బిజీగా ఉంటున్నారు. కాగా పవన్, ఆనంద్ సాయి ఇద్దరూ 30 ఏళ్లుగా స్నేహితులు. గతంలో తొలి ప్రేమ, తమ్ముడు, జానీ, సహా పలు సినిమాలకు పనిచేశారు.

pawan-kalyan-best-friend-anand-sai-worked-for-usthad-bhagath-singh-movie-under-harish-shankar-direct

ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఆనంద్ సాయి బాగుంటుందని పవన్ కళ్యాణ్ ను తానే అడిగానని అన్నారు. ఆయనను అడుగు చేస్తానంటే తనకేం ప్రాబ్లమ్ లేదని అన్నారన్నారు. ఆనంద్ సాయిని అడగ్గానే పవన్ సినిమాకు వర్క్ చేసి చాలా కాలం అయ్యిందని.. అందుకే వెంటనే చేస్తా అని అన్నారని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఒక పాట కోసం ఆనంద్ సాయి సెట్ డిజైన్ చేశారని వివరించారు. ప్రస్తుతం హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+