రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్..''ఊహించిన దానికంటే ఇది చాలా తక్కువే ''
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్ ఇప్పుడు తరచూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.

రేణు దేశాయ్ చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటించారు. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ యానిమల్స్, చిన్నపిల్లల కోసం ఫండింగ్ కలెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తనకూ తోచినంత సాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళం అడుగుతూ జంతు ప్రేమికురాలు అనిపించుకుంటుంది.

తాజాగా, ఓ పెట్‌కు సర్జరీ చేయించాలంటూ రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా డొనేషన్స్ అడిగారు. ఆ పెట్‌కు ఆరోగ్య పరిస్థితి చూపిస్తూ.. కొంత డబ్బులు ఇవ్వాలని ఆమె కోరడం జరిగింది. అయితే డొనేషన్స్‌పై నెటిజన్ల నుంచి పెద్దగా స్పందన వచ్చినట్టు కనిపించలేదు. కేవలం పది మంది మాత్రమే విరాళం అందచేసినట్లు రేణు దేశాయ్ తెలిపారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. నా సోషల్ మీడియాలో 1.1 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ కేవలం పది మంది మాత్రమే విరాళం ఇచ్చారు. కుక్కలను ప్రేమించేవారు ఎక్కువ మందే ఉంటారని, డొనేషన్స్ కూడా అదే విధంగా వస్తాయని ఊహించానంటూ తన పోస్ట్ రేణు దేశాయ్ రాసుకొచ్చారు. మరి రేణు దేశాయ్ ఆవేదన చూసి అయిన నెటిజన్లు డొనేషన్స్ ఇస్తారేమో చూడాలి.












Click it and Unblock the Notifications