పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మరో కొత్తమూవీకి గ్రీన్ సిగ్నల్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మళ్లీ ఖుషి చేస్తున్నారు. ఇన్నాళ్లు రాజకీయాల కారణంగా సినిమా షూటింగ్ లను పక్కన పెట్టిన ఆయన ఇప్పుడు వరుసగా కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ పూర్తి కాగా.. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నారు. అలానే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న "ఓజీ" మూవీలో కూడా తన పార్ట్ షూటింగ్ ని ఫినిష్ చేసేశారు.
ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇన్ని రోజులు మిగిలిన సినిమాల గురించి ఒక అప్డేట్ అయిన ఇచ్చారు కానీ.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఏ అప్డేట్ ఇవ్వలేదు. దాంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ వాటికి చెక్ పెడుతూ మూవీ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు పవన్.

కాగా ఈ మూడు సినిమాలు ఫినిష్ అయిన తర్వాత పవన్ మళ్లీ రాజకీయాల్లో బిజీ అవుతారని భావించారు. కానీ పవర్ స్టార్ ఆయన అభిమానులకు మరో తీపి కబురు అందించనున్నట్టు టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. మూవీ సర్కిల్స్ లో నడుస్తున్న టాక్ ప్రకారం.. పవన్ కళ్యాణ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఫుల్ హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ తమిళ దర్శక, నటుడు సముద్రఖని దర్శకత్వంలో బ్రో అనే సినిమా చేశారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన "వినోదయ సిత్తం" చిత్రానికి రీమేక్ గా వచ్చింది ఈ మూవీ. మామఅల్లుళ్లు పవన్ - సాయి ధరమ్ తేజ్ ఆ మూవీలో కలిసి నటించారు. ఇప్పుడు మళ్లీ సముద్రఖని డైరెక్షన్ లోనే మరో సినిమా చేసేందుకు పవన్ ఒకే చెప్పారని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు పవన్ నటించిన చిత్రాల్లో 'హరి హర వీరమల్లు' కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తర్వాత ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. దాదాపు 13 సార్లు ఈ మూవీ రిలీజ్ వాయిదా వేయగా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించగా.. కీరవాణి ఈ సంగీతం అందించారు.












Click it and Unblock the Notifications