ఓటీటీలోకి 'హరిహర వీరమల్లు'.. ఈ రాత్రి నుంచే స్ట్రీమింగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 24 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కానీ రిలీజ్ రోజు నుంచే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోయింది. దీంతో ఈ మూవీతో బిజినెస్ చేసినవాళ్లు భారీ నష్టాల్ని చవిచూశారు.

సుదీర్ఘ విరామం తర్వాత పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్ తోపాటు తెలుగు సినీ అభిమానులు ఈ మూవీపై ఆసక్తిగా ఎదురుచూశారు. పవన్‌ కెరీర్‌ లో నటించిన తొలి పీరియాడిక్‌ మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ మొదటి షో నుంచే మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

అయితే ఈ మూవీ తాజాగా ఓటీటీ లోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 20 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. దీంతో విడుదలైన నెల రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్లు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు.

Pawan Kalyan s Harihara Veeramallu to Stream on Amazon Prime from August 20

నిధి అగర్వాల్ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించారు. ఇక బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి తదితరులు మూవీలో నటించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+