ఓటీటీలోకి ‘హరిహర వీరమల్లు’..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా కథ, దర్శకత్వంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా, సినిమాలోని కోర్ ఎమోషన్ సరిగా ప్రజెంట్ చేయలేదని, సెకండ్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంతవరకు నిరాశ చెందుతున్నారు.

క్రిష్ జాగర్లమూడి మొదట ఈ సినిమాను తెరకెక్కించినా, తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం సినిమా అవుట్‌ పుట్‌పై ప్రభావం చూపిందని అభిమానులు తేల్చేశారు. జ్యోతి కృష్ణకు పెద్దగా అనుభవం లేకపోవడం, స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేకపోవడం వంటి విమర్శలు వచ్చాయి.సినిమాలోని కంటెంట్ ఒక మాదిరిగా ఉన్నప్పటికీ, ప్రధానంగా అత్యంత దారుణమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కారణంగా అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

Pawan Kalyan s Harihara Veeramallu has fixed the OTT date
రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, చిన్న సినిమాల్లో కూడా కనిపించే క్వాలిటీ VFXను కూడా అందించలేకపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు. తక్కువ బడ్జెట్‌లోనూ అద్భుతమైన VFXతో వస్తున్న ఈ రోజుల్లో, ఇంతటి భారీ సినిమాకు కనీస స్థాయి నాణ్యత లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా నిలిచింది. ఈ నాణ్యత లోపం సినిమా వసూళ్లపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. తాజాగా ఈ ఓటీటీ డేట్ లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఆగస్టు 15న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఆగస్టు 15న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను ఒప్పందం కంటే ముందుగానే స్ట్రీమింగ్ చేయడానికి వీలుగా, అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్మాతలకి అదనంగా 15 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ వారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఓటీటీ వెర్షన్‌లో థియేటర్లలో చూపించని కొన్ని కొత్త సన్నివేశాలు మరియు అప్‌డేట్ చేసిన VFX కూడా జతచేయనున్నారని సమాచారం. ఇది సినిమా అభిమానులకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+