అది నా పిల్లరా .. తనూజ కోసం పవన్ సాయి వార్నింగ్ అతనికే !

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో "బిగ్ బాస్". ప్రస్తుతం ఈ 9వ సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఈ సీజన్‌కు ఎండ్‌కార్డ్ పడనుంది. ఊహించని ట్విస్టులు, టాస్కులు, ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ కలిపి ఈ సీజన్ ప్రేక్షకులకు నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. గత వారం అంతా మొత్తం ఫ్యామిలీ డ్రామాతో సాగిన బిగ్ బాస్ హౌస్ వీకెండ్ ఎలిమినేషన్ దగ్గరికి వచ్చేసింది. ఈరోజు ( నవంబర్ 23, 2025 ) ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారో అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు లేటస్ట్ గా ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేయగా ఫుల్ వైరల్ అవుతోంది.

ఆ ప్రోమోలో ముందుగా కమెడియన్, హీరో శ్రీనివాస్ రెడ్డి, సుమన్ శెట్టి పిల్లలతో కలిసి వచ్చాడు. మీరు చాలా బాగా ఆడుతున్నారు నాన్న కచ్చితంగా కప్పుతోనే ఇంటికి రావాలని ఆయన పిల్లలు అనడంతో ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత శ్రీనివాస రెడ్డి భరణిని చూడగానే బయట ఏ చెరుకు మిషన్ చూసినా మీరే గుర్తొస్తున్నారు అంటూ చెబుతాడు. అయితే ఆ మిషన్ నుంచి రసం వస్తుంది కానీ ఈ మిషన్ నుంచి ఏం రసాలు రావట్లేదని ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు.

pawan-sai-comments-on-thanuja-at-bigg-boss-9-telugu-promo-goes-viral

అది నా పిల్ల..

కాగా ఆ తర్వాత హౌస్ లోకి హరిత జాకి, సీరియల్ నటుడు పవన్ సాయి వస్తారు. హరితను చూడగానే తనుజ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను చాలా మిస్ అవుతున్నాను అని ఏడ్చేస్తుంది. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు.. కప్పు ఎప్పుడు తీసుకొస్తావని మేం కూడా వెయిట్ చేస్తున్నామని హరిత అంటుంది. ఇక అప్పుడే పవన్ సాయి కూడా నా లేడీ సింగం.. కష్టపడి విజిల్ వేయడం నేర్చుకుంటున్నాను తెలుసా.. అంటూ తనూజ గురించి మాట్లాడాడు. ఇక బాక్స్‌ నుంచి పవన్ సాయి ఒక ఫొటో తీయగా అందులో అర్జున్ రెడ్డి అని ఉంది.

దీంతో పవన్ అర్జున్ రెడ్డి ఫేమస్ డైలాగ్ గుర్తుందా నీకు అని నాగార్జున అడిగారు. అది నా పిల్ల.. నాన్న గారు (భరణి) జాగ్రత్తగా చూసుకోండి.. అంటూ డైలాగ్ కొట్టి పవన్ సాయి షాకిచ్చాడు. ఈ మాట వినగానే తనూజ సిగ్గుపడిపోయింది. దీంతో వీరిద్దరి ప్రేమాయణం ప్రోమోలో హైలెట్గా నిలిచింది. ఈ సంభాషణను కళ్యాణ్ అయితే అలా చూస్తూ ఉన్నాడు. ఈ సీజన్ లో తనూజతో కొంచెం క్లోజ్ గా ఉంటాడు కళ్యాణ్. వీరిద్దరి గురించి కూడా ప్రోమోలు, వీడియోలు రావడం చూడవచ్చు. ఇప్పుడు పవన్ సాయి కామెంట్స్ ఇన్ డైరెక్ట్ గా కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చినట్టు అని భావిస్తున్నారు.

పవన్ సాయి-తనూజ బాండింగ్ గురించి సీరియల్ ఫ్యాన్స్‌కి బాగా తెలిసిందే. పవన్ మొగలిరేకులు సీరియల్ లో నటనతో ఆకట్టుకోగా.. ముద్దమందారం సీరియల్ లో హీరోగా అలరించాడు. తనూజ-పవన్ సాయి కలిసి చేసిన ముద్ద మందారం సీరియల్ అప్పట్లో సూపర్ హిట్ అయింది. దీంతో పాటు ఓ తమిళ్ సీరియల్ కూడా వీళ్ళు కలిసి చేశారు. పవన్ సాయి తన లైఫ్‌లో ఒక ముఖ్యమైన వ్యక్తి అంటూ తనూజ చాలా సార్లు చెప్పింది. రియల్ లైఫ్ లో పవన్ భార్యతో విడాకులు తీసుకున్నాడు. పవన్ తన భార్యతో విడాకులు తీసుకోవడానికి కారణం తనూజ అంటూ అప్పటిలో సోషల్ మీడియాలో బాగానే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం తనూజ, పవన్ సాయి రిలేషన్ లో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రూమర్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+