హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. గతేడాది ఓజీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మూవీ ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న రిలీజ్ కానుంది. ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఏ రేంజ్ హిట్ కొట్టిందో మనకు తెలిసిందే. అప్పటి వరకూ ఉన్న ఇండస్ట్రీ రికార్డుల్ని ఈ మూవీ తిరగరాసింది. దాదాపు ఇన్నేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
అయితే మార్చి 15 ఆదివారం రోజున ఈ మూవీ ప్రీ- రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ తోపాటుగా మూవీలోని కీలక నటులు, హీరోయిన్లు, చిత్ర నిర్మాతలు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ ప్రొమోషన్లలో భాగంగా హీరోయిన్ రాశీఖన్నా కీలక విషయాలను వెల్లడించారు. తాజాగా రాశీఖన్నా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ తో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను పంచుకున్నారు.
ఈ మేరకు రాశీ ఖన్నా మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో పవన్ సర్ చాలా తక్కువగా మాట్లాడేవారు. మాట్లాడినా బుక్స్, సినిమాలు, పాలిటిక్స్ గురించే మాట్లాడేవారు. ఒకసారి.. మీరు సినిమాల్లోకి రావాలని అనుకున్నారా..? లేదా నటనలోకి రాకముందు వేరే ఏమైనా అవ్వాలని అనుకున్నారా..? అని పవన్ సర్ నన్ను అడిగారు. అప్పుడు.. నేను ఐఏఎస్ అవ్వాలని అనుకున్నానని.. కానీ అది కుదరక ఇలా సినిమాల్లోకి వచ్చానని పవన్ సర్ కు చెప్పాను. దాంతో ఆయన ఐఏఎస్ అవ్వడం కుదరకపోతే రాజకీయాల్లోకి రావచ్చు కదా.. అలా అయినా ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పారు. కానీ పాలిటిక్స్ నా వల్ల కాదు అని చెప్పినట్టు రాశీ ఖన్నా తెలిపారు.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. అంటూ పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది.












Click it and Unblock the Notifications