మొత్తానికి ప్రియుడిని హీరోని చేసిన తెలుగు హీరోయిన్
హేమంత్ ఇప్పలపల్లి స్వీయ దర్శకత్వంలో, తానే నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ ఫస్ట్ టైం. తక్కువ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో, ఇండియాలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక వీఎఫ్ఎక్స్ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, సాంగ్, ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ విశ్లేషకులు విచ్చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ అందించారు. ముఖ్యంగా అందాల తార పాయల్ రాజ్‌పుత్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ చిత్రంలో ఎక్కడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకుండా, కేవలం హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోనే అత్యున్నత స్థాయి గ్రాఫిక్స్ క్రియేట్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత. సనాతన ధర్మానికి, ఆధునికతకు అద్దం పడుతూ, విశ్వాన్ని నడిపించే బ్రహ్మదేవుని కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ద్వారా సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయమవుతుండగా.. 'బిగ్ బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్‌గా, అనిక్క విక్రమన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా.. వేణు మురళీధర్, రామ్ కెమెరా బాధ్యతలను నిర్వహించారు.

నటి పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ... "డైరెక్టర్ హేమంత్ ఈ సినిమా కోసం తన సర్వస్వాన్ని పెట్టారు. సినిమా రిలీజ్ అయ్యాక అందరూ ఇందులోని వీఎఫ్ఎక్స్ గురించే మాట్లాడుకుంటారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. హీరో సౌరబ్ ఈ సినిమాను ఒక ప్రతిజ్ఞలా తీసుకుని కష్టపడ్డాడు, తను కెరీర్‌లో చాలా ఉన్నత స్థాయికి వెళ్తాడు" అని ఆమె చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ..ఒక్కడే ఇన్ని బాధ్యతలు మోస్తూ సినిమా తీయడం సామాన్యమైన విషయం కాదు. ట్రైలర్ చూస్తుంటే విశ్వాన్ని ముందుకు నడిపించే బ్రహ్మదేవుణ్ణి చూపిస్తున్నట్లు చాలా గ్రాండ్‌గా ఉంది. ఖచ్చితంగా థియేటర్‌కు వెళ్లి చూడదగ్గ సినిమా ఇది అని పేర్కొన్నారు. మా దర్శకుడు హేమంత్ తన కుటుంబానికి దూరంగా ఉండి రాత్రింబవళ్ళు ఈ సినిమా కోసం శ్రమించారు. మాకు అండగా నిలిచిన స్పందనకి, ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహించిన పాయల్‌కు నా కృతజ్ఞతలు. ఇంతకాలం పాయల్ వల్ల నేను గర్వపడ్డాను, ఇకపై నా నటనతో నువ్వు గర్వపడేలా చేస్తా అని హీరో సౌరభ్ ధింగ్రా తెలిపారు.
ఈ 'ఫస్ట్ టైం' చిత్రం సనాతన ధర్మానికి, మోడ్రన్ సొసైటీకి అద్దం పట్టేలా ఉంది. ఒక సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి. నటి గాయత్రి గుప్తా, అనిక్క విక్రమన్, సంగీత దర్శకుడు శ్రీ వెంకట్, జీ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ కూడా మాట్లాడుతూ హేమంత్ పడిన కష్టాన్ని కొనియాడుతూ.. వీఎఫ్ఎక్స్ పరంగా ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ అంచనాలు, విజువల్ వండర్స్‌తో రాబోతున్న ఈ "ఫస్ట్ టైం" చిత్రం మే 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications