మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ???

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్‌ గ్లింప్స్‌, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముందుగా వచ్చిన వీడియోలో చరణ్ ఫుల్ గా జుట్టు, గడ్డంతో రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. చెర్రీ కొట్టే ఐకానిక్ క్రికెట్ షాక్ కూడా ఫుల్ ట్రెండింగ్ అయ్యింది. అలానే మార్చి 27వ తేదీ రామ్ చరణ్(Ramcharan) పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి పహిల్వాన్ గ్లింప్స్ (pehelwan glimpse )అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

peddi-movie-starring-ram-chran-and-jahnvikapoor-again-postponed-the-release-date-and-news-got-viral

అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఈసారి కూడా వాయిదా పడుతుందని నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆ ఊహాగానాలను నిజం చేస్తూ మూవీ యూనిట్ సైతం అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మూవీ రిలీజ్ కొంచెం ఆలస్యం కానుందని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం పట్ల మెగా అభిమానులతో పాటు, సినీ లవర్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు అయితే ఏకంగా ఈ మూవీ కూడా మరో హరిహర వీరమల్లు అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. పవన్ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడి డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ఆ పోస్టులో..

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. 'టాకీ' పార్ట్ మొత్తం పూర్తయ్యిందని.. కేవలం ఒకే ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎడిటింగ్ పనులు కూడా ఒక కొలిక్కి రావడంతో, సినిమా అవుట్‌పుట్ చూసి మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరికొంత సమయం కేటాయించాలని టీమ్ నిర్ణయించుకుంది. టెక్నీషియన్లు తమ పనితనాన్ని మరింత మెరుగుపరిచి.. సినిమాను పర్ఫెక్ట్‌గా తీసుకురావాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మరోవైపు ఈ చిత్రంలో ఉండబోయే ఒక మాస్ స్పెషల్ సాంగ్ గురించి గత కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మొదట ఈ పాట కోసం బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్‌ను అనుకున్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మృణాల్ స్థానంలో ఇప్పుడు మిస్ ఇండియా 2020 విజేత మానస వారణాసి (Manasa Varanasi) 'పెద్ది' టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు ఫిలిం నగర్ టాక్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+