'పెద్ది' ట్రైలర్ వచ్చేస్తోంది.. మెగా ఫ్యాన్స్ కు పూనకాలే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన్ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న మూవీ పెద్ది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా మూవీ అనేక కారణాల వద్ద వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ ను మే 18 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అధికారిక ప్రకటన చేసింది.
అయితే ట్రైలర్ రిలీజ్ ను నార్త్ ఇండియాలో అంటే మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ది మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టాలంటే నార్త్ ఇండియాలో ప్రొమోషన్స్ గట్టిగా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు సానా తనదైన శైలిలో ప్రొమోషనల్ స్ట్రాటజీని చేస్తున్నారు.
పెద్ది మూవీని వృద్ధి సినిమాస్, మైత్రీమూవీ మేకర్స్ సంయుక్తంగా రూ. 400 కోట్లకుపైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాకు మ్యూజిక్ మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే రిలీజైన చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి.

అలాగే పెద్ది గ్లింప్స్ ఆకట్టుకుంది. దాంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్ లో ఏమేరకు అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications