ఆ హీరోతో రొమాన్స్ చేయడానికి ఏదైనా త్యాగం చేస్తా - పూజా హెగ్డే
హీరోయిన్ పూజా హెగ్దే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరు ఠక్కున పూజా హెగ్దే పేరునే చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో 'మహర్షి', ప్రభాస్‌తో 'రాధే శ్యామ్', ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత', అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురం' సినిమాల్లో నటించి మెప్పించింది.
తెలుగు ఇండస్ట్రీలో కొన్నేళ్ళ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే... అనూహ్యంగా కనుమరుగైంది. వరుస ఫ్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుక పడిపోయింది. 'రాధే శ్యామ్', 'ఆచార్య', 'బీస్ట్', 'సర్కస్', 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది.

పైగా గురుజీ సైతం 'గుంటూరు కారం' సినిమా నుంచి తప్పించడంతో.. పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. అయితే అమ్మడుకు వరుస ఊహించని విధంగా మళ్లీ రేసులోకి దూసుకువచ్చింది. విజయ్ ,సూర్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్‌లో కూడా ఓ సినిమాకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన 'దేవా' సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.
ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.తెలుగులో రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఈ భామ తెలిపింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా అంటే ఇష్టమని, బాహుబలి-3 సినిమా తీస్తే ఆ సినిమాలో నటిస్తానని బుట్టబొమ్మ వెల్లడించింది. ప్రభాస్‌తో మరోసారి కలిసి నటించేందుకు తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఆ పాత్ర కోసం ఎంతకైనా తెగిస్తానని పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే వీరిద్దరూ కలిసి 'రాధేశ్యామ్' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఈ జంటకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ గురించి పూజా హెగ్డే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications