viral video: వరద ఉగ్రరూపం దాల్చింది.. 200 ఏళ్ల రికార్డు బద్దలు

దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ(IMD) అంచనా ప్రకారం కేరళ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ, ముంబై, గుజరాత్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కేరళలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. అలాగే గుజరాత్ లోని సూరత్ వర్షం ఉగ్రరూపం దాల్చింది. గత రెండు రోజులుగా అక్కడ కురుస్తున్న అతి భారీ వర్షాలకు ఐదుగురు మృతి చెందారు. అలాగే మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో వర్షాల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

దక్షిణ కన్నడ లోని పలు జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. అక్కడి పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలకు సెలవులు ప్రకటించారు. ప్రజల్ని లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలు స్థానిక బీచ్ లు, కొండ ప్రాంతాలకు వెళ్లకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మత్స్యకారులు చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

ఇక భారీ వర్షాలు, వరదల కారణంగా గుజరాత్ అస్తవ్యస్తం అవుతోంది. గుజరాత్‌ లోని సూరత్‌ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కామ్రేజ్‌ లో 403ఎంఎం, పల్సానాలో 357 ఎంఎం వర్షపాతం నమోదైంది. దీంతో 200 ఏళ్ల రికార్డు బద్దలు కావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఏరియాలు జల దిగ్బంధమయ్యాయి. రూరల్ ఏరియాల నుంచి వరద పోటెత్తడంతో జనజీవనం స్తంభించింది. ఈ ప్రమాదాల్లో ఆరుగురు చనిపోగా, అధికారులు 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 72 గంటలు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

Gujarat in Disarray as Heavy Rains and Floods Batter Surat 403 mm in Kamrej Gujarat heavy rains

సూరత్ లోని అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోయాయి. దాంతో ప్రజలు ఇళ్లు, అపార్ట్ మెంట్స్ నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. వర్షం నీటి కారణంగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు. సూరత్ లోని రాండర్ ప్రాంతంలోనూ విద్యుత్ షాక్ కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఆదేశాల మేరకు అక్కడి పాఠశాలలు మూసివేశారు. రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+