బ్రతికి ఉండగానే చనిపోయినట్టు ప్రకటించుకున్న నటి ఎవరంటే..?
బాలీవుడ్‌లో గ్లామర్, సోషల్ మీడియా హంగామా, వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే నటీమణుల్లో "పూనమ్ పాండే" ఒకరు. మోడలింగ్ ప్రపంచం నుంచి సినీరంగంలోకి వచ్చిన ఆమె.. సినిమాల్లో ప్రధాన పాత్రలకంటే ఎక్కువగా బోల్డ్ పాత్రలు, స్పెషల్ అపియరెన్సులతో గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో కూడా తన బోల్డ్ పోస్టులు, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ చర్చకు కేంద్రంగా నిలిచింది. మరీ ముఖ్యంగా బ్రతికి ఉండగానే చనిపోయినట్టు ప్రకటించుకొని విమర్శలను మూటగట్టుకుంది.
మరణ వార్తతో షాక్..
2024లో పూనమ్ పాండే పేరు మరోసారి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆమె టీమ్ సోషల్ మీడియాలో ఆమె సర్వికల్ క్యాన్సర్ కారణంగా మరణించిందని ప్రకటించింది. ఈ వార్తతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా షాక్‌కు గురయ్యారు. కానీ ఆమె ఇంటి వద్ద ఎలాంటి విషాద వాతావరణం కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రకటన జరిగిన కేవలం 24 గంటల తర్వాత పూనమ్ పాండే స్వయంగా వీడియో విడుదల చేసి తాను బతికే ఉన్నానని తెలిపింది. సర్వికల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే ఇలా చేశానని ఆమె వివరణ ఇచ్చింది. చాలామంది దీనిని పబ్లిసిటీ స్టంట్‌గా అభివర్ణించారు.

చిన్నప్పటి జీవితం..
పూనమ్ పాండే 1991 మార్చి 11న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు ఫ్యాషన్, గ్లామర్ రంగాలపై ఆసక్తి ఉండేది. చదువు పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలో స్థిరపడి మోడలింగ్ కెరీర్ ప్రారంభించింది. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి త్వరగా గుర్తింపు సంపాదించింది.
మోడలింగ్ కెరీర్..
మోడలింగ్ రంగంలో పూనమ్ పాండే 2010లో జరిగిన GladRags Manhunt & Mega Model Contestలో టాప్ 9లో నిలిచి మొదటిసారి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పలు ఫోటోషూట్లు, ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొంది. ముఖ్యంగా 2012లో విడుదలైన Kingfisher Calendar కోసం చేసిన ఫోటోషూట్ ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫోటోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా ప్రజాదరణ పెరిగింది.
సినీ ప్రయాణం..
మోడలింగ్‌లో గుర్తింపు వచ్చిన తర్వాత పూనమ్ పాండే సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2013లో విడుదలైన "Nasha" సినిమాతో ఆమె హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె ఒక టీచర్ పాత్రలో నటించింది. సినిమా పోస్టర్లు విడుదలైనప్పుడే బోల్డ్ కంటెంట్ కారణంగా వివాదాలు చెలరేగాయి. ఆ తర్వాత పూనమ్ పలు సినిమాల్లో నటించింది. వాటిలో ప్రధానంగా Nasha (2013), Love Is Poison (2014 - కన్నడ), Malini & Co. (2015 - తెలుగు), Aa Gaya Hero (2017 - హిందీ), The Journey of Karma (2018) వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా పలు మ్యూజిక్ వీడియోలు, వెబ్ కంటెంట్‌లలో కూడా ఆమె కనిపించింది.
సోషల్ మీడియాలో సంచలనాలు
పూనమ్ పాండే పేరు మొదట పెద్దగా వినిపించడానికి కారణం 2011 క్రికెట్ ప్రపంచకప్. భారత జట్టు ప్రపంచకప్ గెలిస్తే తాను నగ్నంగా సంబరాలు జరుపుకుంటానని ప్రకటించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ప్రకటనతో ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత కూడా బోల్డ్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తరచూ వార్తల్లో నిలిచింది. 2020లో పూనమ్ పాండే తన ప్రియుడు Sam Bombayను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇద్దరూ హనీమూన్ కోసం గోవాకు వెళ్లారు. అయితే వివాహం జరిగిన కేవలం 11 రోజుల్లోనే పూనమ్ తన భర్తపై దాడి, బెదిరింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గోవా పోలీసులు సామ్ బాంబేను అరెస్ట్ చేశారు. తర్వాత ఇద్దరూ పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించుకున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications