రెండోసారి తల్లి కానున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్..

నటి పూర్ణ తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషల్లో తనదైన నటనతో అలరిస్తూ వస్తోంది. అఖండ, అఖండ 2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. పూర్ణ.. 2022 లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇప్పటికే ఒక బాబు (హమ్దాన్) ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఆమె రెండోసారి గర్భం దాల్చి, సీమంతం వేడుకను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక తాజాగా జరిగిన సీమంతం వేడుకలో హీరోయిన్ పూర్ణ.. పింక్ కలర్ గౌను ధరించి మెరిసిపోయింది. అయితే ఈ గౌను వెనుక ఒక అందమైన జ్ఞాపకం ఉందని ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. తన భర్త మొదటిసారి 'ఐ లవ్ యూ' అని చెప్పిన రోజు ఈ గౌనును బహుమతిగా ఇచ్చినట్లు గుర్తుచేసుకుంది. ఈ మేరకు ఎమోషనల్ అయింది. ఇక బేబీ బంప్ ఫొటోలతోపాటు సీమంతం వేడుకలో పూర్ణ తన భర్త, బాబుతో కలిసి దిగిన ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ మేరకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Poorna tollywood Second Motherhood Journey Begins Stunning Baby Bump Photos Light Up the Internet

ఇక పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం.. ఆమె టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా (2016) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో అవును , అవును 2 చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా అల్లరి నరేషన్ తో సీమ టపాకాయ్, వెంకటేశ్ దృశ్యం 2 లో నటించింది. ఆ తర్వాత బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ, అఖండ 2 చిత్రాల్లో నటించింది. నాని దసరా చిత్రంలోనూ పూర్ణ నటించింది. ఆమె నటించిన చాలా టాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+