CID Shakuntala: ప్రముఖ నటి సీఐడీ శకుంతల కన్నుమూత..

దక్షిణ భారత సినీ పరిశ్రమలో విషాదం జరిగింది. ప్రముఖ నటి శకుంతల కన్నుమూశారు. ప్రస్తుతం శకుంతల వయస్సు 84 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. శకుంతలకు ఛాతిలో నొప్పి రావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. శకుంతల దక్షణాదిలో ఆనేక సినిమాల్లో చేశారు.

తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లోని చాలా చిత్రాల్లో నటించారు. అలాగే అనేక డైలీ సీరియల్ లో నటించారు. శకుంతల తమిళ సినీ పరిశ్రమలో దిగ్గజాలతో కలిసి నటించారు. ఎంజీఆర్, శివాజీ గణేషన్ వంటి వారితో కలిసి పని చేశారు. తెలుగులో తెలుగులో అక్కినేని నాగేశ్వర‌రావు నటించిన బుద్ధిమంతుడు, సూపర్‌స్టార్ కృష్ణ నటించిన నేనూ మనిషినే చిత్రాల్లో కనపించారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించారు.

Popular actress CID Shakuntala passed away due to illness

శకుంతల స్వస్థలం తమిళనాడు అరిసిపాళయంలోని సేలం. ఆమె తల్లిదండ్రులు ఆమెకు పాత తమిళ చిత్రం శకుంతలై పేరు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. శకుంతల చెన్నైలో లలిత - పద్మిని - రాగిణి నిర్వహించిన షోలో డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆమె మొదటిసారిగా సూరియన్ మెర్కేయియం ఉతిక్కుమ్ అనే నాటకంలో నటించారు. 1970లో సీఐడీ శంకర్ సినిమాతో ఆమె సీఐడీ శకుంతలగా మారిపోయారు.

శకుంతల మరణం పట్ల కన్నడ ఫిలిం ఇండస్ట్రీ సంతాపం ప్రకటించింది. ఆమె మరణం పట్ల తమిళ, మళయాల, తెలుగు సినీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శకుంతల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+