నిజాయితీగా లేనోడు..ఆ పని ఎప్పటికీ చేయలేడు.. రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్ ఇప్పుడు తరచూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.
రేణు దేశాయ్ చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటించారు. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ యానిమల్స్, చిన్నపిల్లల కోసం ఫండింగ్ కలెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తనకూ తోచినంత సాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళం అడుగుతూ జంతు ప్రేమికురాలు అనిపించుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రముఖ రచయిత థామస్ పైన్ చెప్పిన ఓ స్ఫూర్తిదాయకమైన మాటను పంచుకున్నారు. "నిజాయితీగా ఉండాలంటే, కొంతమందిని నొప్పించడానికైనా సిద్ధంగా ఉండాలి. ఎవరినైనా నొప్పించడానికి భయపడేవాడు నిజాయితీగా ఉండలేడు." అనే క్యాప్షన్‌ను కూడాని పోస్ట్‌ను షేర్ చేసింది.అయితే రేణు దేశాయ్ ఈ పోస్ట్‌ను ఎవర్ని ఉద్దేశించి పెట్టారో క్లారిటీ లేదు. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది












Click it and Unblock the Notifications