పవన్ కల్యాణ్ షాకింగ్ నిర్ణయం.. ఆందోళనలో ఫ్యాన్స్
ధర్మం కోసం నిలబడే విల్లు.. హరిహర వీరమల్లు అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే వారిపై యుద్ధమే హరిహర వీరమల్లు కథ అని తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబు అరాచకాలను ఎదురించే పాత్ర తనదని వివరించారు. కోహినూర్ వజ్రం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని పేర్కొన్నారు.
"నన్ను విశాఖ లో ఇబ్బంది పెట్టడం, చంద్రబాబు ను అరెస్టు చేయడం వంటి ఘటనలతో అప్పుడు షూటింగ్ ఆలస్యం అయింది. చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత వర్కవుట్ చేశాం. ఇందులో రాజకీయ అంశాలు లేవు.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మాత్రమే. సినిమానా, రాజకీయాలా అంటే నా ప్రయారిటీ రాజకీయాలకే. నా వల్ల నిర్మాతలు నష్టపోయారు. నా సినిమాల ఆలస్యం వల్ల వారు బలైపోయారు. నైతిక బాధ్యత వహించి నేను వాటిని పూర్తి చేశాను. రెమ్యూనరేషన్ గురించి ఆలోచన చేయలేదు. సినిమా పూర్తి చేయాలనే పని చేశాను" అని పవన్ కల్యాణ్ తెలిపారు.
"గత ప్రభుత్వం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడి వరకు రావడం చాలా గ్రేట్ అనిపించింది. ప్రతి చిన్నపాటి పనికి ఒక చిన్న యుద్ధం చేయాల్సిందే. జీవితం లో సంఘర్షణ అనేది ఒక భాగం మచిలీపట్నంలో మొదలైన కథ హైదరాబాదు, ఢిల్లీ వరకు నడుస్తుంది. ఊహాజనితమైన కథ ఇది. చారిత్రక నేపథ్యంతో తీశాం. ఆ రోజుల్లో టిక్కెట్ తగ్గించారు. ఈ ప్రభుత్వం పెంచేలా అవకాశం ఇచ్చారు. ఇదంతా నా చేతిలో లేదు. అలా జరిగింది అంతే. నా నిర్మాతలతో పాటు నేను కూడా నష్టపోయాను. నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ఏ పరిస్థితులు అయినా ఎదుర్కొని నిలబడతా. నేను ఏ సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొనను. మా కూటమి ఎమ్మెల్యే లు కోరితే ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తాం" అని పవన్ కల్యాణ్ తెలిపారు.

"సినిమా గ్లామరస్ గా కనిపిస్తుంది... జానీ దర్శకత్వం వహిస్తే ఆడలేదు. డిస్టిబ్యూటర్లు ఆనాడు నా ఇంటి మీదకు వచ్చారు. లాభాలు వస్తే నాకు అదనంగా డబ్బులు ఇవ్వరు కదా అనిపించింది. మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక ఇబ్బందులు అనే భావన కలిగింది. ఆ అనుభవం నన్ను బాగా బలంగా ఉండేలా చేసింది. 2019 ఎన్నికలలో ఓడిన సమయంలో ఆ అనుభవం తో నిలబడ్డా. ఒకసారి నష్టం వస్తే ఇంతలా నాకు వ్యతిరేకంగా మాట్లాడతారా అని తెలిసింది. ఎఎం రత్నం వంటి నిర్మాత ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారు. ఆయనకు అన్ని విధాలా అండగా ఉండాలనే నేడు నిలబడ్డా. ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం నేనే బాధ్యత తీసుకుని దర్శకత్వం వహించా. నిర్మాత కష్టం చూసే రెమ్యూనరేషన్ కూడా ఇంకా తీసుకోలేదు. ఈ సినిమా విజయవంతం అయ్యాక తీసుకుందాం. పార్ట్ టూ ఇరవై శాతం షూటింగ్ పూర్తి చేశాం. చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉన్నా ఓకే..కానీ ఏపీలో షూటింగ్ లకు అనువుగా మౌలిక వసతులు కల్పించాలి. ఫిల్మ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లు ఏర్పాటు చేయాలి" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications