సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

సూపర్ స్టార్ రజినీకాంత్.. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఆయనకు భాషతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేవలం ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రజినీకి ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్, థాయ్ లాండ్, బ్యాంకాక్ సహా పలు దేశాల్లో సూపర్ స్టార్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో.. ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ మూవీ ఆడియన్స్ ని ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' మూవీలో నటిస్తున్నారు. 2023లో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జైలర్' చిత్రం భారీ విజయాన్ని సాధించింది. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖ నటుల గెస్ట్ అప్పియరెన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. రజనీకాంత్ క్రేజ్ ఏంటో మరోసారి నిరూపించింది. దీంతో సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

speculations-about-power-star-pawan-kalyan-special-cameo-in-rajini-kanth-jailer-2-movie

కాగా ఈ సీక్వెల్‌లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ పాత్రలను కొనసాగిస్తూనే మరో తెలుగు స్టార్ హీరో కూడా కీలక క్యామియో రోల్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పాత్రలో టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ నటించనున్నారన్న ప్రచారం సినీ వర్గాల్లో బాగా వినిపించింది. రజినీకి నందమూరి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. దాంతో ఆయన నటించడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. ఏపీకి చెందిన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా స్పెషల్ రోల్ చేయబోతున్నారని గుసగుసలు సైతం వినిపించాయి. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో బాలయ్య ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అయితే కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో షారూఖ్ ఖాన్ స్పెషల్ క్యామియో చేయబోతున్న జోరుగా డిస్కషన్ నడిచింది. షారూఖ్ నటించిన రావణ్ సినిమాలో.. చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలో రజినీకాంత్ రిఫరెన్స్ ఏ రేంజ్ లో వర్కౌట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అంతే కాకుండా వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా షారూఖ్ నటించడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆ పాత్రని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేశారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసేసి రిలీజ్ కూడా చేసేశారు. కాగా తమిళనాట రజినీకి ఉన్న క్రేజ్.. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా కనిపించాల్సిన అవసరం లేదు. దాంతో సూపర్ స్టార్, పవర్ స్టార్ ఇద్దరు కలిసి స్క్రీన్ మీద కనబడితే థియేటర్లు తగలబడిపోవడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+