ఇండియాలో నెంబర్‌వన్ సెలబ్రిటీలుగా ఇద్దరు తెలుగువారు
బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ సంస్థ ప్రతి నెలా సినీ పరిశ్రమలో అత్యధిక ప్రజాదరణ దక్కించుకున్నవారి జాబితాను విడుదల చేస్తుంటుంది. ఏనెలకు ఆ నెలలో విడుదలయ్యే ఈ జాబితాలో తరుచుగా పేర్లు, స్థానాలు మారుతుంటాయి. అయితే గత కొంతకాలం నుంచి పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్, దక్షిణాది బ్యూటీ సమంత నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంటున్నారు. అక్టోబరు నెలలో కూడా వీరు మొదటిస్థానంలో నిలవగా, తాజాగా విడుదల చేసిన జాబితాలో హీరోల్లో నెంబర్ వన్ గా ప్రభాస్, హీరోయిన్లలో నెంబర్ వన్ గా సమంత నిలిచారు.
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులు
డార్లింగ్ ప్రభాస్ సలార్, కల్కి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. అలాగే సందీప్ దర్శకత్వంలో స్పిరిట్ చేయబోతున్నాడు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను దాదాపు రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. కెరీర్ లో తొలిసారిగా ప్రభాస్ పోలీసు అధికారి పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులు అత్యంత ఉత్కంఠతతో ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూస్తున్నారు.

అత్యధిక వ్యూస్ దక్కించుకుంది
సమంత రెండు సంవత్సరాల నుంచి సినిమాలు చేయనప్పటికీ నెంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం. దీన్నిబట్టి ఆమెకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్ కు రీమేక్ సిరీస్ హనీబన్నీ చేసిన సమంత అందులోని యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నారు. ఇటీవలే అది అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది. అత్యధిక వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించింది. త్వరలోనే మరో వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమవుతోంది. తెలుగులో మాఇంటి బంగారం పేరుతో సొంత బ్యానరులో ఓ సినిమా చేస్తోంది. ఇది త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. మయోసైటిస్ కు చికిత్స తీసుకునేందుకు గ్యాప్ తీసుకోవడంతో ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు రావడంలేదని సమంత బహిరంగంగానే చెప్పింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగానే జీవిస్తోన్న సమంత ఇటీవలే ఓ పోస్ట్ పెట్టింది. దాన్నిబట్టి ఆమె రెండోపెళ్లి చేసుకునే అవకాశం లేదని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications