ప్రభాస్ - సమంత కాంబినేషన్ లో మిస్సయిన చిత్రం తెలుసా?
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రభాస్ తో సినిమా చేయాలంటే కనీసం రూ.300 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే సలార్ చిత్రంతో తన స్టామినా ఏమిటో డార్లింగ్ చూపించారు. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ రోజుల్లోనే ఈ సినిమా రూ.700 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సీక్వెల్ ను సలార్ శౌర్యాంగ పర్వంగా తెరకెక్కిస్తున్నారు. కల్కి, రాజాసాబ్ చిత్రాల తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వారిని ఒక కాంబోలో తెరపై చూడాలని అభిమానుల కోరిక. ఒక్కోసారి వారి కోరిక నెరవేరుతుంది కానీ ఎక్కువసార్లు మాత్రం నెరవేరదు. కొన్ని కాంబినేషన్లు ఇలా ఉంటాయి.. బాగుంటాయి.. సూపర్ అని చెప్పుకోవడమేకానీ కార్యరూపం దాల్చవు. అటువంటి కాంబినేషన్లలో ప్రభాస్-సమంత కాంబినేషన్ ఒకటి.

వీరిద్దరూ కలిసి ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శీను సినిమాను వినాయక్ ముందుగా ప్రభాస్ తో చేయాలనుకున్నారు. కథ విన్నతర్వాత డార్లింగ్ దీన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించింది. ప్రభాస్ ఈ కథను ఒప్పుకొని ఉంటే కచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రాన్ని అభిమానులు ఆస్వాదించేవారు. ఏది ఏమైనప్పటికీ కొన్ని సంవత్సరాలుగా, కళ్ళు కాయలు కాచేలా అభిమానులు ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభాస్-సమంత కాంబినేషన్ లో సినిమా మాత్రం తెరకెక్కడంలేదు. భవిష్యత్తులో ఏమైనా కుదురుతుందేమో చూడాలి మరి.












Click it and Unblock the Notifications