ప్రభాస్ 'రాజాసాబ్' టికెట్ ధరల పెంపు.. ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'రాజాసాబ్' చిత్రం విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా జీవో విడుదల చేసింది. జీవో ప్రకారం.. రాజాసాబ్ ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ. 1000 గా నిర్ణయించింది.
జనవరి 9 నుంచి 10 రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునేందుకు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియాకు పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రీమియర్ షోతో ఏపీలో జనవరి 8న సాయంత్రం 6 గంటలకే ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అర్థరాత్రి 12 గంటల లోపు ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ. 350 నుంచి రూ. 400 వరకు ఉంటుంది. అలాగే మల్టీ ఫ్లెక్సుల్లో టికెట్ ధర రూ. 450 నుంచి రూ. 550 వరకు ఉండనుంది.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించారు. తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ సుమారుగా 3 గంటల 10 నిమిషాలు ఉంది. తాజాగా రిలీజ్ అయిన నాచో.. నాచో వీడియో సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక జనవరి 9 న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. ప్రభాస్ తాతగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు.












Click it and Unblock the Notifications