ప్రభాస్ 'రాజాసాబ్' కు ఊహించని జాక్ పాట్.. ఇక జాతర షురూ..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ కు ఊహించని జాక్ పాట్ తగిలింది. సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఇదే రోజు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమా 'జన నాయగన్' కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాంతో మూవీ వాయిదా పడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో సంక్రాంతి బరి నుంచి విజయ్ తప్పుకున్నాడు. దాంతో ప్రభాస్ రాజాసాబ్ కు సోలో రిలీజ్ దొరికింది.
విజయ్ చివరి సినిమా కావడంతో తమిళ్, కేరళ, కర్ణాటకలో చాలా థియేటర్లు ఈ మూవీకే కేటాయించినట్లు సమాచారం. అయితే అనూహ్యంగా మూవీ వాయిదా పడిన నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ మూవీకి ఇది కలిసొచ్చే విషయం అని చెప్పొచ్చు. ఈ రాష్ట్రాల్లోని చాలా థియేటర్లు ఇప్పుడు జన నాయగన్ నుంచి రాజాసాబ్ కు బదిలీ చేస్తున్నారు. దీంతో తొలిరోజు ప్రభాస్ దేశవ్యాప్తంగా బిగ్ నెంబర్స్ పెడతారని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. సెన్సార్ సభ్యులు, చిత్ర యూనిట్, డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ హిట్ టాక్ వస్తుంది.
మరోవైపు రాజాసాబ్ మూవీ టీమ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.1000 గా నిర్ణయించింది. జనవరి 8 సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల లోపు స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. జనవరి 9 నుంచి 10 రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునేందుకు నిర్మాణ సంస్థకు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులిచ్చింది.

పెంచిన ధరలు చూస్తే.. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్స్ ల్లో టికెట్ పై రూ.200 వరకూ పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. తాజా నిర్ణయంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ 350 నుంచి రూ 400 వరకూ అలాగే మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధర రూ 450 నుంచి రూ. 550 వరకూ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications