'కల్కి': అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి!!
పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ నటించిన 'కల్కి' చిత్రం విజయపథంలో దూసుకుపోతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా విజువల్ వండర్ గా సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. భారత్ నుంచి హాలీవుడ్ స్థాయి సినిమా రాదా? అని అడుగుతున్నవారికి సమాధానం చెప్పేలా నాగ్ దీన్ని తెరకెక్కించారు. ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు ఇందులో భాగస్వాములయ్యారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీద్ తెరకెక్కించి 'కల్కి' కి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు. అశ్వనీద్ కూతుర్లు ఇద్దరూ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
కలెక్షన్లు ఎందుకు తగ్గాయబ్బా?
విడుదలైన అన్నిచోట్ల మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటిరోజు 191.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే రెండోరోజు కలెక్షన్లు తగ్గినట్లు తెలుస్తోంది. మొదటిరోజుమీద రూ.50 కోట్లు తక్కువగా వచ్చాయని తెలుస్తోంది. దీనికి కారణం ఏమిటనేది వైజయంతీ మూవీస్ కు కూడా అంతుపట్టకుండా ఉంది. కేలం రూ.149 కోట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. మౌత్ టాక్ తో కూడా సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్న తరుణంలో కలెక్షన్లు ఎందుకు తగ్గాయా? అని విశ్లేషిస్తున్నారు.

ఓపెనింగ్స్ బాగానే వచ్చాయిగా..
ఓపెనింగ్స్ బానే వచ్చినప్పటికీ రెండో రోజు తగ్గడాన్ని బట్టి సినిమా ఎక్కలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. సినిమాను రెండుభాగాలుగా, మూడు భాగాలుగా తీయాలనే మోజు అందరిలో ఎక్కువవుతోందని, అవసరమైన కథను రెండో భాగంలో చూపిస్తున్నారు. మొదటి భాగంలో మాత్రం దృశ్యాలను లాగి లాగి చూపిస్తున్నారు. ప్రేక్షకులకు బోరు కొట్టిస్తున్నారనే టాక్ వస్తోంది. బాహుబలి, కేజీఎఫ్ మాత్రం రెండు భాగాలు ఎందుకు ఆకట్టుకున్నాయంటే కథ పెద్దది కాబట్టి దానికి రెండు భాగాలు అవసరమయ్యాయి. అవసరం లేకపోయినా అన్ని సినిమాలను అనవసరంగా రెండు భాగాలుగా కొనసాగిస్తూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications