మొదట సలార్ సినిమా హీరో వేరు?
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు సినీ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. తీసిన మూడు సినిమాలు సూపర్ హిట్ అవడం, రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా విడుదలై కన్నడ ఇండస్ట్రీకి పెద్ద పేరును తీసుకువచ్చాయి. అప్పటి నుంచి కన్నడంలో దాదాపు ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కు స్టార్ హీరోలకన్నా ఎక్కువ ఫాలోయింగ్ వచ్చింది.
అతనితో సినిమాలు చేసేందుకు దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు హీరోలంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పెద్ద హీరోలకున్నంత రేంజ్ పాపులారిటీ ప్రశాంత్ నీల్ సొంతం చేసుకున్నాడు. తాజాగా ప్రభాస్ తో సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి సలార్ సినిమాను మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన మరో స్టార్ హీరోతో చేయాలని అనుకున్నాడు.

ఆ హీరో మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీతోనే సలార్ సినిమాను తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ భావించాడు. అల్లు అర్జున్‌కి కూడా కథ నచ్చింది. కానీ కాల్షీట్లు సర్దుబాటు చేయడం కుదరక కొన్ని నెలలు వెయిట్ చేయమని కోరాడు. అయితే ప్రశాంత్ నీల్ ఆ కథను ప్రభాస్ కు వినిపించగా తనకు కథ నచ్చి ఓకే చెప్పడంతో ప్రాజెక్టు పట్టాలెక్కింది. మరికొద్దిరోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

బన్నీ ఎంతో ఇష్టపడిన సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ ఇలా వేరే హీరోకి ఇచ్చేయడం పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు ఈ సినిమా విషయంలో మా హీరోను మోసం చేశావు.. అంటూ శాపనార్దాలు పెడుతున్నారు. సలార్ కథను బన్నీకోసం రాసుకున్నట్లు ప్రభాస్ కు తెలియదంట. దీంతో ఈ వార్త విని ప్రభాస్ అభిమానులు కూడా షాక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications