పాడుతా తీయగా షోలో ఎక్స్ పోజింగ్, బాడీ షేమింగ్.. సునీత, కీరవాణిలపై ఆ సింగర్ సంచలన వీడియో
పాడుతా తీయగా షో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రాం తెలియని వాళ్లు ఉండరు. దివంగత ఎస్పీ బాలు ఈ షోకు ఎన్నో సీజన్లపాటు హోస్ట్ గా వ్యవహరించి ఈ షో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఈ పాటల ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది యువతీ యువకులు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ఈ సింగింగ్ షో తర్వాత అనేక షోస్ వచ్చాయి. కానీ పాడుతా తీయగా మాత్రం తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.
అయితే ఎస్పీ బాలు కరోనా కారణంగా మృతిచెందడం, ఈ షో వేరే ప్రొడక్షన్ హౌస్ కు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ పాటల ప్రోగ్రాంకు ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ హోస్ట్ గా ఉన్నారు. ప్రస్తుతం పాడుతా తీయగా 25వ సీజన్ కొనసాగుతోంది. ఇదే షోకు ప్రస్తుతం కీరవాణి, సునీత, చంద్రబోస్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ షోకు సంబంధించి సింగర్ ప్రవస్థి ఆరాధ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సీరీస్ లో తనకి అన్యాయం జరిగింది అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసింది. ప్రవస్థి చిన్నవయసు నుంచే ఎన్నో సీజన్లలో ఈ షోలో పాటలు పాడుతోంది. మంచి సింగర్ గా ఎస్పీ బాలు, సూశీల, జానకమ్మ, చిత్ర లాంటి వారి నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ప్రవస్థి తన యూట్యూబ్ ఛానల్ లో పాడుతా తీయగా షోపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో పాడుతా తీయగా షోలోని జడ్జీలు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న చీకటి కోణాన్ని ప్రవస్థి బయటపెట్టింది. వీడియోలో మాట్లాడుతూ.. నాకు మ్యూజిక్ ఫీల్డ్ కు సంబంధం లేదని ఫిక్స్ అయ్యాకే ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది ఈ వీడియో ఆపాలని చూశారు. జడ్జీలు నన్ను ఒక చీడపురుగులా చూసేవాళ్లు. అసలు నేను ఎందుకూ పనికిరాను అన్నట్టు అనేవాళ్లు. ఇలాంటి జడ్జీల నుంచి ఇది ఊహించలేదు. నా బాడీ మీద కూడా జోక్స్ వేశారు. నేను చాలా షోలు చేశాను కానీ ఎక్కడా ఇలా చూడలేదు. చాలా పెద్ద సింగర్స్ నన్ను పొగిడారు కానీ వీళ్లు ఇలా అంటున్నారు. ప్రొడక్షన్ వాళ్లు నన్ను చాలా తిప్పే వాళ్లు, ఎక్స్ పోజింగ్ చేయమనేవాళ్లు, చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకోమనేవారు. నేను చాలా ఇబ్బంది పడ్డాను అయినా పాడాను.
ఎస్పీ బాలు సర్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి లేవు. అయితే ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వచ్చారో అప్పట్నుంచే ఇలాంటివన్నీ. మమ్మల్ని డ్యాన్సులు చేయమని, కుళ్లు జోకులు చెప్పమని టార్చర్ చేస్తున్నారు. నన్ను డ్యాన్స్ చేయమని బలవంత పెట్టారు. సినీత గారు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. స్టేజీ మీదకు ఎందుకు వచ్చిందా అని ఫేస్ పెట్టేవాళ్లు. నేను సింగింగ్ కెరీర్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాను అందుకే ఇలా మాట్లాడుతున్నాను. ఇక నాకు ఛాన్సులు ఇవ్వరని తెలుసు. ఇలాంటి ఫ్రాడ్ షోలు చూడటం ఆపేయండి.
నాకు ఏమైనా అయినా, నా ఫ్యామిలీకి ఏమైనా అయినా సునీత గారు, చంద్రబోస్ గారు, కీరవాణి గారు, జ్ఞాపిక ప్రొడక్షన్ అనిల్ కారణం అంటూ చెప్పింది. ప్రస్తుతం ఆమె వీడియో సంచలనంగా మారింది. అయితే దీనిపై సునీత, చంద్రబోస్, కీరవాణి, జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్లు, హోస్ట్ ఎస్పీ చరణ్ ఏం సమాధానం ఇస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications