అతన్ని ప్రేమించా కానీ అమ్మాయిల పిచ్చోడని వదిలేశా - స్టార్ బ్యూటీ
ప్రియా భవాని శంకర్.. తమిళ సినీ పరిశ్రమలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదట న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. 2017లో "మేయా దమాన్" అనే తమిళ సినిమా ద్వారా నటిగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది.
అలానే తెలుగులోనూ "కళ్యాణం కమనీయం" మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత గోపీచంద్ తో 'భీమా', సత్యదేవ్ సరసన 'జీబ్రా' సినిమాల్లో మెప్పించింది. అలానే డబ్బింగ్ సినిమాలు ఇండియన్ 2, డిమోంటీ కాలనీ 2, బ్లాక్ తో కూడా మంచి గుర్తింపు సంపాదించింది. వీటితో పాటు నాగ చైతన్య సరసన "ధూత" వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తన టాక్సిక్ రిలేషన్ షిప్ గురించి బయటపెట్టింది. తన మాజీ ప్రియుడి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ..
కాలేజీలో ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని తెలిపింది. కానీ అతడు చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడని.. విధేయత లేని రిలేషన్ షిప్ లో ఎక్కువకాలం ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. అలాంటి రిలేషన్ షిప్ లకు బ్రేకప్ చెప్పేసి బయటకు రావాలని తెలిపింది. దీంతో ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం తన స్నేహితుడు రాజ్ వేల్ తో ప్రేమలో ఉంది ప్రియా భవానీ శంకర్.
ఇక ఇటీవల నటి ఫరియా అబ్దుల్లా తాను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. అలాగే హీరోయిన్ దివ్య భారతి సైతం కాలేజీలో తన లవ్, బ్రేకప్ విషయాన్ని బయటపెట్టింది. సాధారణంగా హీరోయిన్లకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ముఖ్యంగా హీరోయిన్స్ లవ్, డేటింగ్ రూమర్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు హీరోయిన్స్ వరుసగా తమ ప్రేమ విషయాల గురించి ఓపెన్ అవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం గత ఏడాది సక్సెస్ కొట్టిన డీమాంటీ కాలనీ2కి సీక్వెల్ గా వస్తున్న మూడో పార్ట్ లో నటిస్తుంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications