భార్య తాళితో పేకాడుతూ..పవన్ గురించి సంచలన విషయాలను వెల్లడించిన ప్రముఖ నిర్మాత

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ పార్టీలతో కలిసి ఎన్నికలు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లు ఓడిపోయిన పవన్ కల్యాణ్..ఈసారి గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాలని గట్టి పట్టుదల మీద ఉన్నారు. ఈక్రమంలో ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ఆయన పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పవన్ గెలుపు కోసం మెగా హీరోలు సైతం రంగంలోకి దిగారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి హీరోలతో పాటు పలువురు జబర్థస్త్ ఆర్టిస్టులు కూడా పవన్ గెలుపు కోసం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ అతి కొద్దిమందితో మాత్రమే చాలా క్లోజ్‌గా ఉంటారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు, నిర్మాత శరత్ మరార్‌తో కూడా పవన్ కల్యాణ్ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటారు. తాజాగా నిర్మాత శరత్ మరార్ ఓ ఇంటర్య్వూలో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

Film Producer Sharrath Marar Great Words About Pawan Kalyan

పవన్ కల్యాణ్ నిర్మాతలను ఇబ్బంది పెడతారనే టాక్ ఉందని..అదింతా కూడా అవాస్తవమని శరత్ మరార్ తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఆయన పవన్ నిర్మాతలను ఆదుకుంటారని ఆయన తెలిపారు. డబ్బు విషయంలో ఎలాంటి ఫ్లాన్స్ చేసుకోరని..పిల్లలు ఉన్నారు.. డబ్బులు సేవ్ చేసుకోండని నేను త్రివిక్రమ్ చెబితే..వారి లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సినంత ధైర్యం ఇస్తానని పవన్ చెప్పారని శరత్ మరార్ చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా తన దగ్గర పని చేసే మహిళ వాళ్ల భర్త ఆమె మంగళ సుత్రాన్ని అమ్మి పేకాట ఆడాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆమెకు ధైర్యం చెప్పడమే కాకుండా .. ఆర్థిక సాయం కూడా చేశారని శరత్ మరార్ తెలిపారు. అంతేకాకుండా ఆమె భర్తను పిలిపించి పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్ మంచి మనస్సున్న వ్యక్తి అని శరత్ మరార్ చెప్పుకొచ్చారు. పవన్ గురించి శరత్ మరార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+