సాంబారోళ్లకు తెలుగంటే అంత చులకనైందా?

భాష మీద అభిమానం ఉండటం చాలా సహజం. ఎందుకంటే అది మన మాతృభాష. మనం అందులోనే మాట్లాడతాం కాబట్టి. అయితే ఏదైనా కొన్ని పరిమితులకు లోబడి ఉండాలి. హద్దులు దాటితే ఆ అభిమానం దురభిమానంగా మారి సమాజంలోని ఇతర వర్గాల నుంచి దూరం చేస్తుంది. ప్రస్తుతం తమిళలు కూడా తమ భాషపై అభిమానం కన్నా దురభిమానం ఎక్కువగా పెంచుకొని దేశంలోని అన్ని భాషలు మాట్లాడేవారికి దూరమై అంటరానివారుగా మారారు. సాధారణంగా సినిమాలు వేరే భాషల్లో విడుదల చేసే సమయంలో అక్కడి భాషకు అనుకూలంగా, మాతృభాషలో అనుకున్న పేరును విడుదల చేసే రాష్ట్రంలోని భాషకు అనుగుణంగా మార్చి విడుదల చేయడం రివాజు.

తమిళంవారికి శ్రుతిమించింది
కానీ ఇటీవలికాలంలో తమిళుల నుంచి ఈ పరిస్థితి చాలావరకు శ్రుతిమించింది. నేరుగా తమిళంలోనే పేరు ఉంచేసి తెలుగులో విడుదల చేస్తున్నారు. అదే మన తెలుగు సినిమాల పేర్లు అలాగే ఉంచేసి తమిళంలో విడుదల చేస్తే ఒక్కరు కూడా థియేటర్లకు రారు. అదీ వారికి వారి భాషపై ఉండే ప్రేమకన్నా ఇతర భాషలవారిపై ఉండే అహంకారం. తెలుగులో విడుదల చేస్తున్న తమిళ సినిమాల పేర్లన్నీ తమిళంలోనే ఉంచేస్తున్నారు. వాటి అర్థం తెలియకపోయినా, సినిమాపై ప్రేమతో తెలుగోడు థియేటర్ కు వెళ్లి సినిమా చూసి ప్రోత్సహిస్తున్నాడు. కనీసం ఈ మాత్రం మర్యాద కూడా తెలియని అజ్ఞానంలో తమిళులు అనేకన్నా సాంబారోళ్లు ఉండిపోయారని చెప్పొచ్చు.

Producers who are releasing films in Tamil language instead of Telugu language

హీరోలు కూడా పట్టించుకోరా?
వేట్టయాన్, పొన్నియిన్ సెల్వన్, కంగువ, మార్గన్, తుడరుమ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ మార్చని పేర్లే. తాజాగా సూర్య నటిస్తున్న కరుప్పు సినిమాను కూడా అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఎలా ఉన్నా తీసుకుంటారులే? ఎలా ఉన్నా చూస్తారులే? అనే ధీమా తమిళ నిర్మాతలు, దర్శకులు, హీరోల్లో ఉండబట్టే అలా చేస్తున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విజయ్, అజిత్ లాంటి అగ్రహీరోలు జోక్యం చేసుకొని ఇతర భాషలకు అనుగుణంగా పేర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలి. అలా కాకుండా పారితోషికం తీసుకున్నాం.. తమ పనైపోయింది.. ఇక ఎందుకులే అనుకుంటే అది బాధ్యతారాహిత్యం అవుతుంది. భాషపై ప్రేమ ఉండటం ఎంత అవసరమో.. ఇతర భాషలను గౌరవించడం కూడా అంతే అవసరం. అది లేనినాడు జ్ఞానులకు, అజ్ఞానులకు తేడా ఉండదు. అందరూ ఒకటే అవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+