మార్కెట్ కు మెంటలెక్కిస్తున్న పుష్ప2
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 రూపుదిద్దుకుంటోంది. ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. 2021లో విడుదలైన పుష్ప ది రైజ్ సినిమా హిందీ బెల్టులో విడుదలైంది. తెలుగులో కన్నా ఎక్కువగా విజయం సాధించింది. ఎవరూ ఊహించని రీతిలో అక్కడ విజయం సాధించడంతోపాటు రెండో భాగాన్ని దర్శకుడు ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో పుష్ప2 రూపుదిద్దుకుంటోంది. పుష్ప ది రూల్ పేరుతో ఇది విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ ఇప్పటికే మొదలైంది.
అనిల్ తడానీతో కలిసి కరణ్ జోహార్ భారీ ధర వెచ్చించి దీన్ని కొనుగోలు చేశారు. అన్ని భాషల నుంచి ఓటీటీ హక్కుల కోసం రూ.250 నుంచి రూ.300 కోట్ల ధర పలుకుతోంది. మ్యూజిక్ రైట్స్ ను టిసిరీస్ కొనుగోలు చేసింది. కేవలం ఆడియో కోసమేరూ.65 కోట్లు వెచ్చించారు. దక్షిణాదిలో మాత్రం ఇంకా వ్యాపారం జరగలేదు. ఇప్పటికే జరిగిన డిజిటల్ నార్త్ ఇండియన్ థియేటర్ హక్కులు, ఓటీటీ, మ్యూజిక్ రైట్స్ తో కలిపి రూ.540 కోట్లు మైత్రీ మూవీస్ కు వచ్చినట్లు చెబుతున్నారు. మైత్రీ సినిమాతోపాటు సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ కలిసి నిర్మిస్తోంది. తాజాగా బెంగాలీ భాషలో కూడా విడుదల చేయాలని నిర్ణయించారు.

పుష్ప2 సినిమా ద్వారా అల్లు అర్జున్ క్రేజ్ చూస్తుంటే ఈ సినిమా అనేక సంచలన రికార్డులు నెలకొల్పే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. రోజురోజుకు పుష్ప2పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. పుష్ప3 కూడా తీయాలనే యోచనలో ఉన్నారుకానీ ప్రస్తుతానికి విరామం ప్రకటిద్దామనుకుంటున్నారు. అల్లు అర్జున్ తర్వాత చేయబోయే సినిమాలు పూర్తయిన తర్వాత పుష్ప3 చేసి దీన్ని ఫ్రాంచైజీలా తీసుకొచ్చే యోచన చేస్తున్నారు. చివరకు ఈ సినిమా ఎన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications