ఒకేరోజు విలన్‌గా హీరోగా నటించిన ఏకైక నటుడు..!
ఇటీవల యంగ్ స్టార్ హీరోల్లో రాగ్ మయూర్ కూడా ఒకరు. రాగ్ మయూర్ "మెంటల్ మదిలో" చిత్రంతో తన అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత "సినిమా బండి" (2021), "కీడా కోలా" (2023) వంటి చిత్రాలలో నటించాడు.రాగ్ మయూర్ "సివరపల్లి" వెబ్ సిరీస్ మరియు "గాంధీ తాత చెట్టు" చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు ఒకే రోజున విడుదల కావడం విశేషం, రెండింటిలోనూ రాగ్ మయూర్ విభిన్న పాత్రలలో కనిపించాడు.
"సివరపల్లి" లో అతను ప్రధాన పాత్రలో నటించగా, "గాంధీ తాత చెట్టు" లో ప్రతికూల ఛాయలున్న పాత్రలో కనిపించాడు. నిజానికి ఒకేరోజు రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు సినిమాతో పాటు సివరపల్లి వెబ్ సిరీస్ రెండిటికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి. ముఖ్యంగా క్రిటిక్స్ తమ రివ్యూలలో రాగ్ మయూర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇలా భిన్నమైన పాత్రలు చేస్తూ తెలుగులో ఒక మంచి నటుడిగా స్థిరపడాలని భావిస్తున్న రాగ్ మయూర్ ఇప్పటికే గీత ఆర్ట్స్2 లో ఒక పేరు పెట్టని సినిమాతో పాటు పరదా, అలాగే గరివిడి లక్ష్మి సినిమాలో కూడా నటిస్తున్నాడు.
రాగ్ మయూర్ పూర్తి పేరు రాగ్ మయూర్ చేవూరి. అతను హైదరాబాద్ లో జన్మించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివాడు. నటనపై ఆసక్తితో, అతను సినిమాలలోకి ప్రవేశించాడు. అతను ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న నటులలో రాగ్ మయూర్ కూడా ఒకరు.












Click it and Unblock the Notifications