అల్లు అభిమానులకు బిగ్ షాక్.. ఇన్ స్టా పోస్టు వైరల్..!
సెలబ్రిటీస్ లైఫ్ లో ఏం జరిగినా సంచలనంగానే మారుతుంది. తమ అభిమాన హీరో.. హీరోయిన్లు ఏం పోస్టు పెట్టినా క్షణాల్లో లైక్స్ , కామెంట్స్ చేస్తుంటారు. ఇక వారి బర్త్ డే లు, కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్స్, ఇతర శుభకార్యాలకు సంబంధించిన వార్తలను తమ ఫ్యాన్స్ తో పంచుకోవాలని సెలబ్రిటీలు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా అల్లు ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తలిగింది. అల్లు ఫ్యామిలీ యువ హీరో అల్లు శిరీష్ నిశ్చితార్థం రద్దు అయింది. ఈ నెల 31న అంగరంగ వైభవంగా జరగాల్సిన ఎంగేజ్ మెంట్ మొంథా తుపాను కారణంగా రద్దు అయింది. ఇదే విషయంపై అల్లు శిరీష్ చేసిన ఇన్ స్టా పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ నిశ్చితార్థం అక్టోబర్ 31 న నైనికా అనే అమ్మాయితో జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవల చేశారు. ఎంగేజ్ మెంట్ ను ఎలాంటి హడావుడి లేకుండా తన ఇంట్లోని అవుట్ డోర్ ప్రాంతంలో చేసుకోవాలని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ తాజాగా సంభవించిన మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్ లో బలమైన ఈదురు గాలులు, విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో నిశ్చితార్థం కోసం ఏర్పాటు చేసుకున్న వేదిక మొత్తం కుప్ప కూలిపోయింది. ఈ విషయాన్ని అల్లు శిరీష్ తన ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఈ మేరకు విచారణ వ్యక్తం చేశారు.

అయితే నిశ్చితార్థం వేడుకను అదే సమయానికి ఇన్ డోర్ లో చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు అల్లు శిరీష్ నాయనమ్మ మృతి చెంది కేవలం 2 నెలలే కావస్తున్న నేపథ్యంలో నిశ్చితార్థం వేడుకను పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే.. కెరీర్ మొత్తం మీద కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు మాత్రమే సూపర్ హిట్స్ గా నిలిచాయి. మిగతా సినిమాలు ప్లాఫ్స్ గా నిలిచాయి. ఆయన చివరి చిత్రం బడ్డీ కూడా ఆశించినంత విజయం సాధించలేదు.












Click it and Unblock the Notifications