వియ్యంకులు కాబోతున్న మురళీమోహన్-రాజమౌళి(కీరవాణి)?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు కుటుంబాలు కూడా సినిమా పరిశ్రమ పరంగా అతి పెద్ద కుటుంబాలే. ఒక కుటుంబం తెలుగు సినిమా ప్రతిష్టను ఆస్కార్ స్థాయికి తీసుకువెళ్లారు. మరో కుటుంబం 50 సంవత్సరాల నుంచి తెలుగు సినీ పరిశ్రమతోపాటు రాజకీయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తోంది.
తెలుగు ప్రేక్షకులకు, ఈ రెండు కుటుంబాలకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. తాజాగా ఈ రెండు కుటుంాలు వియ్యం అందుకోబోతున్నాయి. సంగీత దర్శకుడు కీరవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కీరవాణి తన సోదరుడు రాజమౌళి కాంబినేషన్ లో చేసే సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ ఆస్కార్ కూడా సాధించి పెట్టింది. కీరవాణి రెండో కుమారుడు సింహ ఇప్పటికే సినిమాల్లో హీరోగా రాణిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలతో కథానాయకుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సింహకు మాగంటి మురళీమోహన్ మనవరాలితో వివాహం కుదిరినట్లు సమాచారం.

సీనియర్ నటుడు, వ్యాపారవేత్త అయిన మురళీమోహన్ కు ఒక్కడే కొడుకు. ఆ కొడుకుకు ఒకరే కుమార్తె. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలైన మాగంటి రూప కూతురే. వేలకోట్ల రూపాలయ ఆస్తికి వారసురాలు. పిల్ల కూడా కుందనపు బొమ్మలా ఉంటుందని, కీరవాణి కుమారుడు సింహ అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. ఈ వివాహానికి ఇరువైపులా కుటుంబాలు ఓకే చెప్పాయని, వచ్చే ఏడాది వివాహం ఉండనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications