ప్రభాస్ 'రాజాసాబ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా విడుదలైన 'రాజాసాబ్' మూవీ ఆశించినంత విజయం సాధించలేక పోయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా విమర్శలను కూడా ఎదుర్కొంది. రిలీజ్ కు ముందు ఫుల్ హైప్ తీసుకొచ్చిన ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ లుక్ సినిమాలో లేకపోవడం వల్ల డిజప్పాయింట్ అయ్యారు. దాంతో ఇటు ప్రేక్షకులను మెప్పించకపోవడమే కాక.. కలెక్షన్ల పరంగా కూడా పెద్దగా రాబట్టుకోలేకపోవడంతో నిర్మాతలకు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ప్రభాస్ ది రాజాసాబ్ ఓటీటీ హక్కులు భారీ ధరకు జీయో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఇదో రికార్డ్ బ్రేకింగ్ డీల్ అని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతోంది. ఈ మూవీ ఫిబ్రవరి 15 శివరాత్రి కానుకగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.

ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయినా ఓటీటీలో మాత్రం దుమ్ము రేపడానికి సిద్ధం అవుతోంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ మూవీస్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఒకేసారి జరుగుతోంది. అయితే తొలుత స్పిరిట్ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్పిరిట్ రిలీజ్ డేట్ ను చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 5 న రిలీజ్ కానున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 చిత్రాలు కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications