రజనీకాంత్ - రామ్‌చరణ్ కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్
రజనీకాంత్ కెరీర్ ప్రారంభంలో మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఆయన చిరంజీవితో కూడా కలిసి నటించారు. ఇండియాలో సూపర స్టార్ అయిన తర్వాత మల్టీస్టారర్ సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. మెగాస్టార చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ చేశాడు. రామ్ చరణ్ - రజనీకాంత్ కాంబినేషన్ లో రావల్సిన మల్టీస్టారర్ సినిమా చిరంజీవి వల్ల వెనక్కిపోయింది.
ఆ పాత్రకు ప్రాధాన్యత లేదు
రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా చేసివున్నారు. అది భారీ ఫ్లాప్ కావడంతో ఏ సినిమా చేయాలా? అనే అయోమయంలో ఉన్నారు. ఆరెంజ్ సినిమాకు బడ్జెట్ కూడా భారీగా అయింది. ఆ రోజుల్లోనే రూ.40 కోట్లు పైగా ఖర్చుపెట్టారు. పవన్ కల్యాణ్ తో బంగారం సినిమా తమిళ డైరెక్టర్ ధరణితో మెరుపు అనే సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాకు కూడా బడ్జెట్ భారీగా అవుతోంది. అందులోను ఓప్రత్యేక క్యారె్టర్ లో రజనీకాంత్ నటించాల్సి ఉంది. ముందుగా ఇవన్నీ అనుకున్న తర్వాత చిరంజీవి ఈ సినిమాను వద్దని చెప్పారు సినిమా బడ్జెట్ అధికంగా ఉండటంతోపాటు రజనీకాంత్ కూడా ఉన్నాడు. కానీ ఆ పాత్రకు అంత ప్రాధాన్యత కనపడలేదు. దీనివల్ల సినిమా ఆడటం కష్టమవుతుందనే ఉద్దేశంతో చిరంజీవి దాన్ని తిరస్కరించాడు

కథలో మార్పులు చేయిస్తే బాగుండేది
ఆ సినిమా కోసం కేటాయించిన డేట్లను ఉపయోగించి సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ పేరుతో మాస సినిమా చేయించారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయినప్పటికీ పేరు తెచ్చిపెట్టింది. మాస్ హీరోగా నిలబెట్టడంలో ఈ సినిమా రామ్ చరణ్ కు తోడ్పడింది. చిరంజీవి కథలో మార్పుచేర్పులు చేయించి రజనీకాంత్ పాత్రను శక్తివంతంగా తీర్చిదిద్దివుంటే బ్రహ్మాండమై సినిమా అయ్యుండేదని, మంచి కాంబినేషన్ ను మిస్ చేసుకున్నామంటూ మెగా అభిమానులు బాధపడుతున్నారు. రామ్ చరణ్ సినిమా చేయాలంటే అప్పుడైనా, ఇప్పుడైనా చిరంజీవి సలహాలు, సూచనలు ఉంటాయి. అంతేకాదు.. కథ ఆయన్ను మెప్పించాలి. అప్పుడే దానికి రామ్ చరణ్ ఓకే చెబుతాడు. లేదంటే అంతే.












Click it and Unblock the Notifications