37 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అయిన రజినీకాంత్ మూవీ..

రజినీకాంత్.. కేవలం ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న సూపర్ స్టార్. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా ఆయనకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్, థాయ్ లాండ్, బ్యాంకాక్ సహా పలు విదేశాల్లో కూడా ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. గత ఏడాది లోకేష్ దర్శకత్వంలో కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో "జైలర్ 2 " చిత్రంలో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ కి ఇది సీక్వెల్ గా రాబోతుంది. వచ్చిన ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి అదరగొట్టారు. ఇప్పుడు ఈ సీక్వెల్ లో విజయ్ సేతుపతి, ఎస్.జె. సూర్య వంటి నటులు కూడా నటిస్తున్నారని సమాచారం. 2026 సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.

rajinikanth-and-shatrughan-sinha-hindi-film-hum-mein-shehenshah-kaun-going-to-release-after-37-yea

అయితే ఇప్పుడు అనూహ్యంగా 37 ఏళ్లుగా ల్యాబ్‌లోనే రజినీకాంత్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సాధారణంగా సినిమాల విడుదల ఆలస్యం నెలలు లేదా ఒకట్రెండు సంవత్సరాలకు మించదు. అరుదుగా కొన్ని అనివార్య కారణాలతో మూడేళ్లు, నాలుగేళ్లు పట్టొచ్చు. అయితే పదేళ్లు ఆలస్యంగా విడుదలైన విశాల్ 'మదగజరాజా' వంటి చిత్రాలు చూసే ఆశ్చర్యపడిన ప్రేక్షకులకు, ఇప్పుడు రాబోయే చిత్రం మరింత వింతగా అనిపిస్తుందని భావిస్తున్నారు.

"హమ్ మే షెహెన్‌షా కౌన్" మూవీ..

రజనీకాంత్, బాలీవుడ్ దిగ్గజ నటుడు శత్రుఘ్న సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'హమ్ మే షెహెన్‌షా కౌన్'. దివంగత హర్మేష్ మల్హోత్రా దర్శకత్వంలో, రాజా రాయ్ నిర్మాణంలో ఈ చిత్రం 1989లో తెరకెక్కింది. హేమమాలిని ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీలో.. అనితా రాజ్, ప్రేమ్ చోప్రా, శరత్ సక్సేనా, దివంగత అమ్రిష్ పురి, జగదీప్ వంటి భారీ తారాగణం కూడా ఉన్నారు. అప్పట్లోనే షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కానీ నిర్మాణాంతర పనులు చివరి దశలో ఉండగా ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా నిలిచిపోయింది. దీని కారణాలు అప్పట్లో వెల్లడించలేదు. ఆ తర్వాత పలుమార్లు విడుదల చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అవి అన్నీ విఫలమయ్యాయి. కాలక్రమేణా దర్శకుడు, నిర్మాతలతో పాటు చిత్ర నిర్మాణానికి సంబంధించిన పలువురు కీలక వ్యక్తులు మృతిచెందడం, ఆర్థిక ఇబ్బందులు, లీగల్ సమస్యలు, కాపీరైట్ వివాదాలు వంటి కారణాలు చిత్రాన్ని దశాబ్దాల పాటు ల్యాబ్‌కే పరిమితం చేశాయి. దీంతో విడుదల ఆశలు సన్నగిల్లాయి, చాలామంది దీని గురించి కూడా మరిచిపోయారు.

rajinikanth-and-shatrughan-sinha-hindi-film-hum-mein-shehenshah-kaun-going-to-release-after-37-yea

ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని నిర్మాతలు ఇప్పుడు రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తుండటం సినీ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రీల్ ఫార్మాట్‌లో ఉన్న సినిమాను ఇప్పటికే డిజిటల్‌ ఫార్మాట్‌గా మార్చారని అంటున్నారు. సౌండ్ క్వాలిటీ, విజువల్స్ మెరుగుపరచడంతో పాటు, సినిమాటిక్ అనుభవం దెబ్బతినకుండా ఏఐ టెక్నాలజీ, 4కే వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌ను మళ్లీ ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అప్పట్లో అసోసియేట్ ప్రొడ్యూసర్లుగా పనిచేసిన షబానా, అస్లాం మీర్జా చేపట్టారు. మరోవైపు, రజనీకాంత్, శత్రుఘ్న సిన్హా, హేమమాలిని వంటి నటీనటుల నుంచి అవసరమైన అనుమతులు పొందడమే కాకుండా, మ్యూజిక్ కాపీరైట్‌కు సంబంధించిన లీగల్ చర్చలు కొనసాగుతున్నాయని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా నిర్మాత రాజా రాయ్ భావోద్వేగంగా మాట్లాడుతూ.. ఈ సినిమాపై మేము ఎప్పుడూ ఆశ కోల్పోలేదని అన్నారు. అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+