జూనియర్ ఎన్టీఆర్‌కు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన రజనీకాంత్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఆగస్టు 14కానీ, 15న కానీ సినిమా విడుదల కాబోతోంది. దీనిపై అంచనాలు సాధారణంగానే ఉన్నాయి. పుష్ప2 సినిమాకు ఉన్నంత హైప్ లేదు. అయినా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్, ఇమేజ్ ఉంటే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందవచ్చనే ఆలోచనతో ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూనే, మరోవైపు హిందీ సినిమాలు కూడా చేస్తున్నాడు. వార్ 2 తర్వాత మరో హిందీ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున, ఉపేంద్ర లాంటి భారీ తారాగణం ఉంది. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.
జూనియర్ ను బాగా డామినేట్ చేస్తాడు
వార్2 సినిమాతో పోలిస్తే కూలీ సినిమాపై సినీ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ను కూడా ఆగస్టు 14కానీ, 15న కానీ విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. లోకేష్ తో సినిమాలు చేయాలని స్టార్స్ అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి దర్శకుడికి రజనీకాంత్ తోడైతే గాలి దుమారం అని చెప్పొచ్చు. అంచనాలు కూడా భారీగా ఉంటాయి. అనుకున్నట్లుగానే ఆగస్టు 14వ తేదీన వార్ 2కు పోటీగా కూలీ కూడా విడుదలైతే రజనీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ ను బాగా డామినేట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంచనాలు అందుకోలేకపోయింది
దేవర సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై కేవలం రూ.550 కోట్లు మాత్రం వసూలు చేయగలిగింది. అందులో తెలుగులో, హిందీలో మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఫ్లాప్ అయింది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప2తో బాహుబలి రికార్డును బద్దలు కొట్టగా, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో రాబోతున్నాడు. ఇటువంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ కు భారీ బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి అవసరం ఉంది. అది ఏ సినిమాతో వస్తుందో తెలియడంలేదు. ప్రశాంత్ నీల్ తో చేసే డ్రాగన్ రూ.వెయ్యి కోట్లకు పైగా వసూలు చేస్తుందని తారక్ అభిమానులు చెబుతున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల కాబోతోంది. అయితే అది ఎంతవరకు వసూలు చేయగలదు, జూనియర్ మార్కెట్ ఎంతవరకు పెరుగుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.












Click it and Unblock the Notifications