మతంపై తలైవా రజినీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్!!
సూపర్ స్టార్ రజినీకాంత్ తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన సినిమా అయిన లాల్ సలామ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తలైవా రజినీకాంత్ ఒక ముస్లింగా మొయిద్దిన్ పాత్రలో నటించారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ట్రైలర్, పోస్టర్ లకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో మతం కీలకంగా ఉండనుంది. దీంతో ఈ సినిమాపై కాస్త నెగటివ్ టాక్ కూడా వస్తుంది. ఇక రిలీజ్ కు సిద్ధమైన ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ భారీగానే ప్రమోషన్స్ చేస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

మతంపై ఆయన చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దేవుడి గురించి మనుషులు అర్ధం చేసుకోవటానికి, తమలో దేవుడు ఉన్నాడనేది గుర్తించటానికి, ప్రశాంతంగా జీవించటానికే మతాలు ఉన్నాయని, అయితే చాలా మంది వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారని రజినీకాంత్ పేర్కొన్నారు. తప్పుడు అర్ధాలు చెప్పే వారివల్లే సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
మత సామరస్యం గురించి చెప్పటం కోసమే లాల్ సలామ్ సినిమాలో నటించానని రజినీకాంత్ పేర్కొన్నారు. దేవుడి గురించి తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, గ్రహించటం వేరు అంటూ రజినీకాంత్ వ్యాఖ్యలు చేశారు. అన్ని మతాలు మానవత్వానికి లాభం చేకూర్చేలా ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా వారికి ఇష్టమైన మతంలో ముందుకు సాగ వచ్చని రజినీకాంత్ పేర్కొన్నారు.

మతాలు వస్తుంటాయని పోతుంటాయి అని రామకృష్ణ పరమహంస చెప్పారన్నారు . కానీ కొందరు మతం పేరుతో తామే గొప్ప అని వాదిస్తున్నారు అని, అందుకే ఇబ్బందులు వస్తున్నాయని రజినీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు మతసామరస్యాన్ని పాటించాలని రజినీకాంత్ పేర్కొన్నారు. ఎవరే మతంలో ఉన్న అందరూ ఐక్యతతోనే ముందుకు సాగాలని సందేశం ఇచ్చారు రజినీకాంత్.












Click it and Unblock the Notifications