జూనియర్ ఎన్టీఆర్‌తో పోటీకి వెళ్లొద్దని హెచ్చరించిన రజినీకాంత్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా వార్ 2 చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా అనేకన్నా నేరుగా హిందీలో మల్టీస్టారర్ చేస్తున్నాడని చెప్పొచ్చు. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకుడు. భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 14వ తేదీన విడుదల చేయాలని ముందే నిర్ణయించుకున్నారు. అయితే షూటింగ్ లో హృతిక్ కాళ్లకు గాయాలు కావడంతోపాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తికాకపోవడంతో ఆ తేదీన సినిమా రావడం అనుమానమేనంటున్నారు.
వారితో మాట్లాడి మాత్రమే ముందుకు వెళ్లండి
ఇదే తేదీకి సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కగనరాజ్ దర్శకత్వంలో చేస్తున్న కూలీ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెండు కీలక సన్నివేశాలతోపాటు ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలింది. మిగతా అంతా పూర్తయిపోయింది. రజినీకాంత్ జైలర్ 2 సినిమాకు ఏప్రిల్ నెల నుంచి కాల్షీట్లు ఇచ్చేశారు. అక్కినేని నాగార్జున ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను 14వ తేదీన విడుదల చేయాలనుకుంటుండగా నిర్మాతలను రజినీకాంత్ హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ తో పోటీకి వెళ్లవద్దని చెప్పారు. అంతేకాదు.. అన్నీ చూసుకొని, వార్ 2 యూనిట్ తో మాట్లాడుకొని మాత్రమే విడుదల చేయాలని, ఆ తేదీకి వారు రాకపోతేనే సినిమాను విడుదల చేయమని సలహా ఇచ్చారు.

అనుకున్న తేదీకి రావడం చాలా కష్టం
అయితే ముందుగా అనుకున్న ఆగస్టు 14వ తేదీకి వార్2 విడుదలయ్యే అవకాశాలు కనపడటంలేదు. హృతిక్ రోషన్ కాళ్లకు దెబ్బలు తగలడంతో షూటింగ్ వాయిదా వేశారు. దీంతో ఇతర నటీనటుల కాల్షీట్లు కూడా దెబ్బతింటాయి. దీంతో ఇదే తేదీకి కూలీ సినిమా రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీంతోపాటు పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ఓజీ సినిమా కూడా ఈ తేదీకి రావడానికి ప్రయత్నాలు చేస్తోందికానీ షూటింగ్ ఇంకా 50 శాతం జరగాల్సి ఉంది. పవన్ కాల్షీట్లు ఇస్తేనే ఆ సినిమా 14వ తేదీన విడుదలవుతుంది. లేదంటే చివరగా కూలీ ఒక్కదానికే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications