కూతుర్లకు కాకుండా తన ఆస్తి మొత్తం వారికి రాసిన రజనీకాంత్?

దక్షిణాదిలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఏకైక సూపర్ స్టార్ హీరో ఎవరయ్యా అంటే అందరూ చెప్పే పేరు రజనీకాంత్. 70 సంవత్సరాల వయసులో కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా యువ హీరోలకు ధీటుగా భారీ బ్లాక్ బస్టర్లు సాధిస్తున్నారు. తాజాగా ఆయన నుంచి వచ్చిన జైలర్ సినిమా రూ.700 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. భాషతో సంబంధం లేకుండా అందరూ ఆయన్ను అభిమానిస్తుంటారు. ఆయన ఆస్తుల విలువ రూ.450 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్యలో ఉంటుంది. సినిమాకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తుంటారు. తన ఆదాయంలో సింహభాగం వాటికే ఖర్చుచేస్తుంటారు. చేసే దానం గోప్యంగా ఉండాలనే విషయాన్ని ఆయన మన్నించి తాను చేసే దానాలన్నింటినీ గుప్తంగా ఉంచుతారు. ఎన్నో సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బును తన కూతుర్లు, బంధువులు కాకుండా సమాజానికే ఇవ్వాలనేది ఆయన కోరిక. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం ప్రజలేనని, అందుకే తాను సంపాదించిన ప్రతి రూపాయి వారికే చెందాలని తన సన్నిహితులతో చెబుతుంటారు రజనీకాంత్.

Rajinikanth wrote his entire property to poor people

అందుకు తగ్గట్లుగానే తాను సంపాదించే డబ్బు మొత్తం అనాధాశ్రమాలకు, ఛారిటీలకు చెందాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. డబ్బుల కోసం హత్యలు చేసే రోజుల్లో తన డబ్బును మొత్తం పేద ప్రజలకు రాయడం అంటే సాధారణ విషయం కాదని రజనీ అభిమానులు కొనియాడుతున్నారు. గొప్ప గొప్ప ఆలోచనలన్నీ రజనీకాంత్ లాంటి గొప్ప వ్యక్తులకే వస్తుంటాయంటున్నారు. అభిమానులనే కాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. మనదేశంలో ఎంత ఫాలోయింగ్ ఉందో జపాన్ దేశంలో కూడా రజనీకి అంతే ఫాలోయింగ్ ఉండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+