ఓటీటీలోకి 'గేమ్ ఛేంజర్'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.కథ, కథనం ఏమీ బాలేదని ప్రేక్షకులు తేల్చేశారు. ఇక మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు. సినిమా ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు విమర్శలు గుప్పించారు.సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి.

తెలిసిన కథే అయినప్పటికీ, కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. ముఖ్యంగా సెకండాఫ్‌ సినిమాకు మరింత మైనస్‌గా మారిందనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తం అయింది. దీంతో మెగా అభిమానులు దర్శకుడు శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ, దర్శకుడు శంకర్ తన మార్క్ చూపించలేకపోయారని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. 'నానా హైరానా' సాంగ్ కూడా సినిమాలో పెట్టకపోవడాన్ని అభిమానులు తప్పుపట్టారు.

ram charan game changer ott release date fix

దీంతో గేమ్ ఛేంజర్ మూవీ 15 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ. 129.01 వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీని ఫలితంగానే "గేమ్ ఛేంజర్" బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవి చూసింది.రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్‌'ను నిర్మించారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.ఎంత తీసేసిన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగానే నష్టాలను మిగిల్చేలా కనిపిస్తోంది. ఇదిలాఉంటే.. గేమ్ ఛేంజర్ OTT విషయానికి వస్తే.. ఫిబ్రవరి రెండవ వారంలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. OTT రూల్స్ ప్రకారం ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+